Home » Tirumala Laddu
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు కాస్తా ఘాటుగా స్పందించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీకి సుప్రీంకోర్టులో జస్టిస్ బి.ఆర్. గవాయ్, కె.వి. బాలకృష్ణన్ ధర్మాసనం.. పలు ప్రశ్నలు సంధించింది.
తిరుమల లడ్డూ వివాదంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కల్తీ నెయ్యి సరఫరా చేశారని టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుతో తిరుపతిలో ఏఆర్ డెయిరీపై కేసు నమోదు అయ్యింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు వివాదం చెలరేగిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కాస్తా ఘాటుగా స్పందించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
భక్తుల మనోభావాలు గౌరవించి జగన్‌ను డిక్లరేషన్ ఇవ్వమంటే దేశం, హిందూయిజం మీద దాడి చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. తన మతం మానవత్వం అని చెప్పుకుంటున్న జగన్‌ది కృరత్వమని విమర్శించారు. జగన్‌ది మానవత్వం కాదు.. కృరత్వమని ఎద్దేవా చేశారు. కల్తీ లడ్డు వ్యవహారంలో జరిగిన తప్పు ఒప్పుకోలేక, క్షమాపణ చెప్పలేక జగన్ వంకర మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనే అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టనుంది. కల్తీ నెయ్యి అంశం గురించి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తదితరులు పిటిషన్ దాఖలు చేశారు.
టీటీడీ చైర్మన్ అంటే భక్తులకు విశేషంగా సేవలు అందించాలి. దీనికి తిరుమల, తిరుపతిలోనే ఎక్కువ సమయం గడపాలి.
తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చేశారంటూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సహా గత టీటీడీ పాలకమండలిపైనా పెద్దఎత్తున భక్తులు మండిపడుతున్నారు.
తిరుమల లడ్డూ విషయంపై సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. లిక్కర్ షాపులు రద్దు చేస్తూ...ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తిరుపతిలో అత్యధికంగా మద్యం షాపులు కేటాయించడాన్ని ఏమనుకోవాలి? అని గుడివాడ అమర్నాథ్ నిలదీశారు.
కేసు పెట్టాలంటే... కల్తీ జరిగిదంటే చాలు.. జంతు కొవ్వు ఉందా లేదా అనేది అనవసరం. కల్తీ జరిగిందనేది నిజం... మరో ఆలోచన లేదని.. నెయ్యి ప్యూర్‌గా లేకుండా ఏది కలిపినా కల్తీ అయినట్టేనని.. శిక్ష ఒక్కటే అని వెంకటేష్ అన్నారు. హత్య చేసేపుడు కత్తి అయినా, తుపాకి అయినా ఒక్కటేనని, దేనితో చంపారనే దాన్ని బట్టి శిక్ష ఉండదని.. హత్య హత్యే అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
తిరుమల పర్యటన రద్దు చేసుకున్న మాజీ సీఎం జగన్‌పై ఏపీ సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే వైసీపీ అధినేత జగన్ పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి ఆరోపించారు.