Home » TPCC Chief
టీపీసీసీ నూతన చీఫ్‌గా బొమ్మ మహేష్ కుమార్‌గౌడ్ ఆదివారం గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు.
Telangana: ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి విమర్శలు చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏడున్నర లక్షల కోట్ల అప్పు పెట్టి తమ చేతిలో రాష్ట్రాన్ని పెట్టి పోయాడు కేసీఆర్ అంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి దక్కాక సీనియర్ నేత మహేశ్ కుమార్ గౌడ్ తొలిసారిగా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు..
Telangana: టీపీసీసీ చీఫ్ పదవిపై గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరనేది ఈరోజు తేలిపోనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ చీఫ్ పేరును ఖారారు చేసినట్లు తెలుస్తోంది. దాన్ని అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం. తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్‌లపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసింది.
కాంగ్రెస్ పార్టీ(INC) 3 రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షుల ఎంపికను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సదరు జాబితా సిద్ధమైందని శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయంలోపు పేర్లను ప్రకటిస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. కాంగ్రెస్ వర్గాల్లో సైతం జోరుగా చర్చ జరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు..? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ పదవీకాలం అయిపోయినంత వరకూ నడిచిన.. ఇంకా నడుస్తున్న ఏకైక చర్చ. ఒకరా ఇద్దరా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయ్..! అదిగో అధికారిక ప్రకటన వచ్చేస్తోంది.. ఇదిగో ఈయనే కన్ఫామ్ అయ్యారని లెక్కలేనన్ని వార్తలు.. అంతకుమించి పుకార్లు షికార్లు చేశాయ్..! ఆశావహులు అయితే ఈసారైనా అదృష్టం వరించకపోదా..? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పరిస్థితి..
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిపై దాదాపుగా స్పష్టత వచ్చింది. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. 15 రోజుల్లో కొత్త పీసీసీ చీఫ్ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. టీ పీసీసీ పోస్ట్ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన కీలక నేతలు జోరుగా లాబీయింగ్ చేశారు. కొద్దిరోజులు ఢిల్లీలోనే మకాం వేశారు. చివరికి హైకమాండ్ ఎస్టీ నేత వైపు మొగ్గుచూపారని విశ్వసనీయ సమాచారం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్త విస్తరణపై హైకమాండ్ పెద్దలకు వివరించేందుకు మరోసారి ఢిల్లీ వచ్చారు. సాయంత్రం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు.
టీపీసీసీ పదవిని మహిళకు ఇస్తే ఎలా ఉంటుంది? ఇదే ప్రశ్నను ఓ విలేకరి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వద్ద ప్రస్తావించగా.. సీఎం ఆసక్తికర సమాధానం ఇచ్చారు.