Home » Traffic rules
కేంద్ర ప్రభుత్వ కొత్తగా తీసుకువచ్చిన క్రిమినల్ లా చట్టాలతో మరికొన్ని చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయి. ఈ నెల ప్రారంభం నుంచే ఈ చట్టాలు అమల్లోకి వచ్చాయి. అయితే, వీటితో పాటు.. నూతన రహదారి భద్రతా నిబంధనలు కూడా మారాయి.
నగరంలో విచ్చలవిడిగా పెరుగుతున్న రాంగ్‌రూట్(Wrongroot) డ్రైవింగ్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ రాంగ్రూట్లో ప్రయాణిస్తున్న వాహనదారులపై బుధవారం ఉక్కుపాదం మోపారు.
ఇటీవల పదోన్నతులు పొందిన 25 వేల మంది టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎల్బీస్టేడియంలో సభ నిర్వహిస్తున్న సందర్భంగా శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు సీపీ (ట్రాఫిక్) పి.విశ్వప్రసాద్(Additional CP (Traffic) P. Vishwaprasad) తెలిపారు.
ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలో సికింద్రాబాద్(Secunderabad) పరిసర ప్రాంతాల్లో ఈనెల 21, 22 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
వానొస్తే.. హైదరాబాద్(Hyderabad) మహానగరంలో ట్రాఫిక్ ఇక్కట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అనే తేడా లేకుండా ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోతాయి. అయితే, ఐటీ కారిడార్(IT Corridor)లో ట్రాఫిక్ ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటాయి.
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి హోంగార్డుల్ని నియమించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. అందులో భాగంగా మొత్తం హోంగార్డుల లెక్క తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.
ఓ పట్టణంలోఎలాంటి శబ్దాలు చేయకుండా వాహనాలు నడుస్తుంటాయి మీకు తెలుసా. ఇదెక్కడో విదేశాల్లో అనుకుంటే పొరపాటే. మన దేశంలోని ఓ ప్రముఖ పట్టణమే ఇది. నమ్మలేకపోతున్నారా. అయితే ఈ వార్త చదవాల్సిందే.
బక్రీద్ ప్రార్థనల సందర్భంగా ఈనెల 17న మాసబ్‌ట్యాంక్(Masabtank) సమీపంలోని మీరాలం దర్గా, హాకీ గ్రౌండ్, లంగర్‌హౌజ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఇన్చార్జి ట్రాఫిక్ జాయింట్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
నగరంలో శనివారం పలుప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్(Heavy traffic jam) ఏర్పడింది. వాహనదారులు రోడ్డుపై నరకయాతన అనుభవించారు. ముఖ్యంగా వెస్టుజోన్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు హోంగార్డులను ట్రాఫిక్ విధుల్లో నియమించాలని సూచించారు. ట్రాఫిక్‌జామ్‌ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోల ద్వారా ప్రజలకు అందజేయాలన్నారు.