Home » Traffic rules
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆదేశించారు.
Vijayawada Traffic Jam: నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో అక్కడి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. బందర్ రోడ్, వారధి రోడ్, ఏలూర్ రోడ్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపుగా గంటన్నర నుంచి ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. వీఐపీ వాహనాలను పంపే హడావుడిలో పోలీసులు ఉన్నారు.
తెలుగు వారి ముఖ్యపండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారితో రెండు రాష్ట్రాల్లోని రహదారులు రద్దీగా మారింది.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం నాడు తన కార్యాలయంలో సీపీ శ్రీనివాస్‌రెడ్డి ( CP Kothakota Srinivas Reddy ) మీడియాతో మాట్లాడుతూ... నగరంలో ట్రాఫిక్ సెక్యురిటీ వీక్‌ని జరుపుకుంటున్నామని తెలిపారు.
వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ట్రాఫిక్ చలాన్స్ చెల్లింపునకు గడువును పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 31వ తేదీ వరకు డిస్కౌంట్ చలాన్ కట్టేందుకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
దేశవ్యాప్తంగా అంతకంతకు పెరిగిపోతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలను (Traffic Violations) అడ్డుకట్ట వేసేందుకు తాజాగా కువైత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ జరిమానాలను భారీగా పెంచనున్నట్లు వెల్లడించింది.
గల్ఫ్ దేశం కువైత్ 2023లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు (Traffic Violations) సంబంధించి జరిమానాల రూపంలో ఏకంగా 66 మిలియన్ దినార్లు (రూ. 1780కోట్లు) వసూలు చేసింది. ఈ మేరకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోని ట్రాఫిక్ ఉల్లంఘనల పరిశోధన విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ముహమ్మద్ సాద్ అల్-ఒటైబీ వెల్లడించారు.
సీఎం జగన్ పర్యటిస్తున్నారంటే చాలు అక్కడి అధికారులు, పోలీసుల హడావుడి అంతా ఇంతా కాదు. సీఎం వచ్చి వెళ్లేదాకా ఆ ప్రాంతవాసులకు చుక్కలు కనిపించడం ఖాయం. సీఎం వెళ్లే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడమే కాకుండా ఆ ప్రాంతంలో ఎవరినీ రానీయకుండా అడ్డుకుంటారు.
హైదరాబాద్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ పరిసరాల్లో మంగళవారం ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. వేడుకలకు వచ్చేవారు వెళ్లాల్సిన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలపై రూట్ మ్యాపు ఇచ్చారు.
లింగంపల్లి రైల్వే అండర్ పాస్ క్రింద వర్షపు నీరు భారీగా చేరుకుంది. బ్రిడ్జ్ కింద రాకపోకలు బంద్ అయ్యాయి. బ్రిడ్జి కింద భారీ వర్షపు నీటితో వాహనదారులు ప్రజల ఇక్కట్లు ఎదుర్కొన్నారు. గడిచిన కొన్ని గంటలుగా వర్షం కురుస్తుండటంతో నీళ్లంతా అండర్ పాస్ కిందకు వచ్చేశాయి. దీంతో బ్రిడ్జ్ కింద రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది నిలిపివేశారు.