Traffic Restrictions: సికింద్రాబాద్‌లో రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లో వెళ్తే ఇరుక్కోవడం పక్కా
ABN , Publish Date - Jul 20 , 2024 | 03:07 PM
ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలో సికింద్రాబాద్(Secunderabad) పరిసర ప్రాంతాల్లో ఈనెల 21, 22 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
హైదరాబాద్: ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలో సికింద్రాబాద్(Secunderabad) పరిసర ప్రాంతాల్లో ఈనెల 21, 22 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. కర్బలా మెయిన్ రోడ్డు, రాణిగంజ్, రామ్‌గోపాల్‌పేట ఓల్డ్ పీఎస్, పారడైజ్, సీటీవో ప్లాజా, ఎస్‌బీఐ ఎక్స్‌రోడ్, వైఎంసీఏ ఎక్స్‌రోడ్డు, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్‌రోడ్, పాట్నీ ఎక్స్‌రోడ్, పార్క్‌లేన్, బాటా, ఘాస్‌మండి ఎక్స్‌రోడ్స్, బైబిల్ హౌజ్, మినిస్టర్‌రోడ్, రసూల్‌పురా తదితర రోడ్లు, జంక్షన్‌ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.
అలాగే పాట్నీ ఎక్స్‌రోడ్డు, బాటా, ఘాస్‌మండి, అధ్వై త, బైబిల్ హౌజ్, కర్బలా, రొచ్చా బజార్, ప్యారడైజ్ ఎక్స్‌రోడ్డుల వద్ద దారిమళ్లింపులు ఉంటాయని, పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా వాహనదారులు గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన సూచించారు.
జాతర పార్కింగ్ స్థలాలు ఇవే..
ఓల్డ్ జైల్ ఖానా ఓపెన్ ప్లేస్, ఇస్లామియా హై స్కూల్, గవర్నమెంట్ అదయ్య మెమోరియల్ హై స్కూల్, ఆదయ్య ఎక్స్ రోడ్, రాణిగంజ్, సికింద్రాబాద్, మహాత్మా గాంధీ విగ్రహం, హరిహర కళా భవన్, మహబూబ్ కాలేజీ, ఎంజీ రోడ్, బెల్సన్ తాజ్ హోటల్, అంజలి థియేటర్, పరేడ్ గ్రౌండ్‌లలో పార్కింగ్ స్థలాలను కేటాయించారు.
మూసేసే రోడ్లివే...
బాటా ఎక్స్ రోడ్ నుంచి రాంగోపాల్ పేట పీఎస్ వరకు
ఆదయ్య ఎక్స్ రోడ్
జనరల్ బజార్ రహదారి
టోబాకో బజార్ నుంచి మహంకాళి టెంపుల్‌కు వచ్చే రోడ్