Home » TSRTC
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆదివారంతో ముగియనున్నాయి. సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఆదివారం సమావేశం ప్రారంభం కాగానే తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిపై లఘు చర్చ జరగనుంది. ఈ చర్చలో కేసీఆర్ మాట్లాడనున్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి కేసీఆర్ కేబినెట్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ పోటోకు పాలాభిషేకాలు కూడా చేశారు.
తెలంగాణ ఆర్టీసీనీ (TSRTC) ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్ క్యాబినెట్ (KCR Cabinet) ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ బిల్లును గవర్నర్ తమిళిసైకు ( Governor Tamilisai) ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు (Raj Bhavan) పంపడం జరిగింది..
ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపకపోవడం.. కొంత సమయం కావాలనడంపై టీఎస్ఆర్టీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రం వ్యాప్తంగా ఈరోజు ఆర్టీసీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు ఆర్టీసీ బస్సుల బంద్ కొనసాగనుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే బస్సులు బంద్
తెలంగాణ ఆర్టీసీ(TSRTC)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ కేబినేట్(KCR Cabinet) ఆమోదం తెలిపింది. ఈమేరకు విలీన బిల్లు(Amalgamation Bill)ను రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్(Governor Tamil Sai Soundararajan) దగ్గరికి ప్రభుత్వం( TS Govt) రెండురోజుల క్రితం పంపించింది.
గురుకుల టీచర్ పరీక్షల( Gurukula teacher exams)పై రేపటి బస్సుల బంద్(bus bandh) ప్రభావం పడనుంది.
రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనుకున్న కేసీఆర్ సర్కార్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్టీసీ బిల్లుని ప్రవేశపెట్టాలనుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆర్థిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం బిల్లుని పంపించగా.. ఇప్పటివరకు గవర్నర్ ఆమోదం లభించలేదు. గవర్నర్ కార్యాలయానికి పంపించామని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.
ఆర్టీపీపై కేసీఆర్‌ది ఎన్నికల కపట ప్రేమ. ఆర్టీసీ కార్మికులను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ విలీన ప్రకటన చేశారు. ఆర్టీసీ కార్మికులు తనకు వ్యతిరేకంగా ఉన్నారని కేసీఆర్ హడావిడి ప్రకటన చేశారు. గతంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని కేసీఆర్ చెప్పారు.
ఇది హండ్రెడ్ పర్సెంట్ అసంభవం.. గవర్నమెంట్లో కలపడం అనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంత కాలంలో జరిగే పని కాదు. ఏపీలో చేస్తున్నారు కదా? చూద్దాం కదా? ఏపీలో ఏం జరిగిందో..! అక్కడొక ఎక్సపర్మెంట్ చేశారు. అక్కడ ఏమీ మనుగడ జరగలేదు.. తెలియదా? కమిటీ వేశారంట.. మూడు నెలలకో.. ఆరు నెలలకో ఏదో చెప్తారంట కథ. ఏం చెబుతారనేది మీకు అర్థం కావట్లేదు. సీఎం జగన్ సంగతే చెబుతున్నా?