TSRTC: ఆర్టీసీ కురవృద్ధుడు నరసింహ ఇకలేరు!

ABN , First Publish Date - 2023-08-24T15:12:04+05:30 IST

నిజాం స్టేట్‌ రైల్‌ అండ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ (NSRRTD)లో ఉద్యోగంలో చేరి ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీకి సేవలందించిన 98 ఏళ్ల ఆర్టీసీ కురవృద్ధుడు టీఎల్ నరసింహ మరణించారు. హైదరాబాద్ ఓల్డ్‌ అల్వాల్‌లోని తన నివాసంలో ఇవాళ తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు.

TSRTC: ఆర్టీసీ కురవృద్ధుడు నరసింహ ఇకలేరు!

హైదరాబాద్: నిజాం స్టేట్‌ రైల్‌ అండ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ (NSRRTD)లో ఉద్యోగంలో చేరి ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీకి సేవలందించిన 98 ఏళ్ల ఆర్టీసీ కురవృద్ధుడు టీఎల్ నరసింహ మరణించారు. హైదరాబాద్ ఓల్డ్‌ అల్వాల్‌లోని తన నివాసంలో ఇవాళ తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు.

గత ఏడాది స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా టీఎల్‌ నరసింహను టీఎస్ఆర్టీసీ (TSRTC) ఘనంగా సన్మానించింది. బస్‌భవన్‌లో జెండా పండుగకు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా వారిని సమున్నతంగా సంస్థ సత్కరించింది.

re.jpg

వజ్రోత్సవాలను పురస్కరించుకొని సంస్థ ట్యాంక్‌ బండ్‌పై చేపట్టిన ర్యాలీని నరసింహ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆ సమయంలో తన అనుభవాలను తన పంచుకున్నారని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. సంస్థ కొత్తగా ప్రవేశపెడుతున్న కార్యక్రమాలను ఎంతగానో ప్రశంసించారని, టీఎస్‌ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేయడానికి సలహాలు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజా రవాణా వ్యవస్థకు ఎంతో సేవచేసిన ఆర్టీసీ కురవృద్ధుడు నరసింహ మరణించడం బాధాకరం అన్నారు. టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. నరసింహ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

rww.jpg

హైదరాబాద్‌ శివారు బొల్లారంలో టీఎల్ నరసింహ 1925లో జన్మించారు. 1944లో నిజాం స్టేట్‌ రైల్‌ అండ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ గుమస్తాగా ఉద్యోగంలో చేరారు. 1983లో ఆర్టీసీ ఎకౌంట్స్‌ ఆఫీసర్‌గా పదవీ విరమణ చేశారు. నిజాం కరెన్సీ ఉస్మానియా సిక్కాలో రూ. 47 జీతంతో ఉద్యోగం మొదలుపెట్టిన ఆయన.. చివరగా రూ. 1,740 వేతనం అందుకొని రిటైరయ్యారు.

Updated Date - 2023-08-24T15:13:22+05:30 IST