Home » Tukkuguda Sabha
తుక్కుగూడ ‘జన జాతర’ భారీ బహిరంగ సభకు నేడు(శనివారం) కాంగ్రెస్ (Congress) పిలుపునిచ్చిది. ఈ బహిరంగ సభలో రాచకొండ పోలీస్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కాన్వాయిని అనుమతించకుండా అడ్డుకున్నారు. డిప్యూటీ సీఎం సిబ్బంది చెబుతున్న వినకుండా అడ్డుపడ్డారని చెప్పారు.
బీఆర్ఎస్ (BRS) కు లోక్సభ ఎన్నికల ముందు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలోని కీలక నేతలంతా వరుసగా కాంగ్రెస్ (Congress) లో చేరుతున్న సమయంలో గులాబీ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇదే కోవలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (Tellam Venkata Rao) కూడా గులాబీ పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం నాడు తుక్కుగూడ కాంగ్రెస్ ‘జనజాతర’ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్కు చర్లపల్లిలో జైలులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని వార్నింగ్ ఇచ్చారు.
Congress Jana Jatara: తుక్కుగూడ.. ఇది కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్.! అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇక్కడ్నుంచే శంఖారావం మోగించి అఖండ విజయం దక్కించుకుంది. దీంతో ఇప్పుడు ఇదే తుక్కుగూడ నుంచే పార్లమెంట్ ఎన్నికలకు కూడా శంఖారావం మోగించింది కాంగ్రెస్. ఈ భారీ బహిరంగసభకు ‘జనజాతర’ (Jana Jatara) అని నామకరణం చేయడం జరిగింది. తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ జెండాలతో నిండిపోయింది..! ఎక్కడ చూసినా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భారీ కటౌట్లే కనిపిస్తున్నాయి. తెలుగు మేనిఫెస్టోను ఈ సభావేదికగా రాహుల్ రిలీజ్ చేశారు. ఈ సభావేదికగా నిరుద్యోగులు, మహిళలకు కీలక హామీలు ప్రకటించారు. అంతేకాదు.. తెలంగాణతో తనకున్న అనుబంధం.. ఫోన్ ట్యాపింగ్, ఎలక్టోరల్ బాండ్స్ ఈ విషయాలన్నింటిపైనా రాహుల్ అదిరిపోయే ప్రసంగం చేశారు.
తెలంగాణతో తనకున్నది రాజకీయ సంబంధం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. తుక్కుగూడలో శనివారం జరిగిన తెలంగాణ జన జాతర సభకి రాహుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.