Share News

Congress Jana Jatara Live Updates: తుక్కుగూడలో కాంగ్రెస్ ‘జనజాతర’.. ఎటు చూసినా జనమే!

ABN , First Publish Date - Apr 06 , 2024 | 04:13 PM

Congress Jana Jatara: తుక్కుగూడ.. ఇది కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్.! అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇక్కడ్నుంచే శంఖారావం మోగించి అఖండ విజయం దక్కించుకుంది. దీంతో ఇప్పుడు ఇదే తుక్కుగూడ నుంచే పార్లమెంట్ ఎన్నికలకు కూడా శంఖారావం మోగించింది కాంగ్రెస్. ఈ భారీ బహిరంగసభకు ‘జనజాతర’ (Jana Jatara) అని నామకరణం చేయడం జరిగింది. తుక్కుగూడ కాంగ్రెస్‌ పార్టీ జెండాలతో నిండిపోయింది..! ఎక్కడ చూసినా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భారీ కటౌట్లే కనిపిస్తున్నాయి. తెలుగు మేనిఫెస్టోను ఈ సభావేదికగా రాహుల్ రిలీజ్ చేశారు. ఈ సభావేదికగా నిరుద్యోగులు, మహిళలకు కీలక హామీలు ప్రకటించారు. అంతేకాదు.. తెలంగాణతో తనకున్న అనుబంధం.. ఫోన్ ట్యాపింగ్, ఎలక్టోరల్ బాండ్స్ ఈ విషయాలన్నింటిపైనా రాహుల్ అదిరిపోయే ప్రసంగం చేశారు.

Congress Jana Jatara Live Updates: తుక్కుగూడలో  కాంగ్రెస్ ‘జనజాతర’.. ఎటు చూసినా జనమే!
Jana Jathara At Tukkuguda

Live News & Update

  • 2024-04-06T20:35:38+05:30

    కేసీఆర్‌కు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

    • కేసీఆర్.. నీకు చర్లపల్లిలో జైలులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా

    • చర్లపల్లి జైలులో కేసీఆర్‌కు చిప్పకూడు తినిపిస్తానని వార్నింగ్

    • నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టివ్వలేదు

    • నేను మాత్రం నీకు తప్పకుండా చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా

    • బిడ్డ, కొడుకు, అల్లుడు, నువ్వూ.. అందరూ కలిసి ఉండేలా ఇల్లు కట్టిస్తా

    • ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోనని కేసీఆర్‌కు రేవంత్ వార్నింగ్

    • ఇటీవల పొలం బాటలో రేవంత్, కాంగ్రెస్‌ సర్కార్‌పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

    • ఇందుకు కౌంటర్‌గా తుక్కుగూడ వేదికగా మాట్లాడిన రేవంత్

    Revanth-Warning-To-KCR.jpg

  • 2024-04-06T20:30:51+05:30

    నమో అంటే.. నమ్మితే మోసం!

    • గోదావరి, కృష్ణా నది పోటెత్తి సునామీ సృష్టిస్తే ఎలా ఉంటుందో తుక్కుగుడలో అలా కనిపిస్తోంది

    • బీఆర్ఎస్‌ని తుక్కుతుక్కు తొక్కినట్టే బీజేపీని తుక్కుతుక్కు తొక్కాలి!

    • కార్యకర్తలు సైనికుల్లాగా కొట్లాడినప్పుడే పార్టీ గెలుస్తుంది

    • కార్యకర్తల చెమట చుక్కల వల్లే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది

    • వైబ్రేంట్ తెలంగాణతో మాపై గుజరాత్ ఆధిపత్యం నడవదని చాటుదాం

    • నిరుద్యోగులకు మాట ఇచ్చి..

    • ఉద్యోగాలు ఇవ్వని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలో సిగ్గులేని కిషన్ రెడ్డి చెప్పాలి

    • రైతులను చంపినందుకు బీజేపీకి ఓటేయాలా..?

    • మతాల మధ్య చిచ్చు పెట్టి మోదీ అధికారంలోకి వచ్చాడు

    • ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి వద్దామని మోదీ చూస్తున్నాడు

    • హైదారాబాద్ కి వరదలు వస్తే మోదీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు

    • నమో అంటే.. నమ్మితే మోసం

    • బీజేపీని బొంద పెట్టేదాక నిద్రపోవద్దు : రేవంత్ రెడ్డి

    Revanth-At-Tukkuguda.jpg

  • 2024-04-06T20:15:59+05:30

    అన్నీ చక్కబెడుతున్నాం!

    • జనజాతర సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

    • ఇదే వేదికపై ఆరు గ్యారంటీలను ప్రకటించాం

    • గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసింది

    • ఇందిరమ్మ పాలనలో అన్ని వ్యవస్థలను చక్కపెడుతున్నాం : భట్టీ

    Bhatti-At-Tukkugoda.jpg

  • 2024-04-06T20:14:33+05:30

    మొత్తం మీరే చేశారు!

    • జనజాతర సభలో కేసీఆర్‌ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నెర్ర!

    • కేసీఆర్ మన ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు

    • నీళ్ళ సమస్య, కరెంట్ సమస్య రాకుండా చూసుకుంటున్నాం

    • కేసీఆర్ హయాంలో కరువు వచ్చింది

    • కేసీఆర్ సర్కార్ లో వాటర్ మేనేజ్మెంట్ పూర్తిగా దెబ్బతీశారు

    • పంట నష్టం తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం

    • కేసీఆర్ అబద్ధాలను కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి తీసుకు వెళ్ళాలి : ఉత్తమ్

    Uttam-kumar-Reddy.jpg

  • 2024-04-06T20:10:52+05:30

    రాహుల్ ప్రసంగంలోని కీలకాంశాలు

    • కొన్ని నెలల క్రితం తెలంగాణకు వచ్చా

    • తెలంగాణకు ఇచ్చిన గ్యారెంటీలను..

    • జాతీయ స్థాయిలో ఆవిష్కరిస్తురన్నా

    • తెలంగాణ ప్రభుత్వం అతికొద్ది కాలంలో 30వేల ఉద్యోగాలు ఇచ్చింది

    • కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజల ఆలోచనలను ప్రతిబింభిస్తోంది

    • దేశంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పన మా లక్ష్యం

    • మేనిఫెస్టోలో 5 న్యాయసూత్రాలు భారతీయుల ఆత్మ

    • ఏం చేయగలుగుతామో అదే మేనిఫెస్టోలో పెట్టాం

    ముఖచిత్రం మార్చేస్తాం!

    • మహిళలు రెండు ఉద్యోగాలు చేస్తున్నారు

    • బయట ఉద్యోగంతో పాటు ఇంటిని కూడా చూసుకుంటున్నారు

    • మహిళల కోసం నారీ న్యాయ్ చట్టం తీసుకొస్తాం

    • నారీ న్యాయ్ పేరుతో పేద మహిళకు రూ.లక్ష సాయం

    • నారీ న్యాయ్‌తో దేశ ముఖచిత్రం మారబోతోంది

    • రాబోయే రోజుల్లో లక్షకు తక్కువ ఆదాయం ఉన్న కుటుంబం ఉండదు

    • ధనవంతులకు రూ.16 లక్షల కోట్ల రుణం మోదీ మాఫీ చేశారు

    • రైతులకు మాత్రం మోదీ రూపాయి కూడా రుణ మాఫీ చేయలేదు

    • మేం అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తాం

    మద్దతు ధర ఇస్తాం..

    • స్వామినాథన్‌ ఫార్ములా ప్రకారం మద్దతు ధర ఇస్తాం

    • కార్మికులకు పనికి తగిన కూలీ దక్కేలా చూస్తాం

    • కార్మికులకు కనీస వేతనం అందేలా చూస్తాం

    • దేశంలో సగంమంది వెనుకబడిన వర్గాలే

    • మొత్తం 90 శాతం మంది జనాభా వెనుకబడిన వర్గాలే

    • ఏ సంస్థలో చూసినా బడుగులు ఉన్నతస్థానాల్లో కనిపించట్లేదు

    కులగణన చేస్తాం..

    • ఏ పెద్ద కంపెనీ ఓనర్ కూడా దళితుడు కనిపించట్లేదు

    • బడుగుల జనాభా 50 శాతం... అధికారంలో భాగస్వామ్యం 5 శాతం

    • 90 శాతం ఉన్న బీసీ, ఎస్టీ, మైనార్టీలకు దేశంలో భాగస్వామ్యం లేదు

    • మేం అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం

    • పాలు, నీళ్లను వేరుచేసి చూపిస్తాం

    ఫోన్ ట్యాపింగ్‌పై..

    • అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ గత సీఎం

    • అందరి ఫోన్లను ట్యాపింగ్‌ చేశారు

    • వేల ఫోన్లను ట్యాప్‌ చేసి, ప్రభుత్వం మారగానే..

    • డేటాను ధ్వంసం చేశారు

    • అందరినీ భయపెట్టి వసూళ్లు చేపట్టారు

    • కాంగ్రెస్ ప్రభుత్వం పనిమొదలుపెట్టింది.. నిజం మీ ముందుంది

    • ఇక్కడ మాజీ సీఎం చేసిందే.. ఢిల్లీలో మోదీ ప్రభుత్వం చేస్తోంది

    • బీజేపీ అతిపెద్ద వాషింగ్‌మెషీన్‌ను నడిపిస్తోంది

    • బీజేపీలో చేరగానే అవినీతిపరులంతా నీతిమంతులవుతున్నారు

    • ఈసీ సహా అన్ని సంస్థల్లోనూ బీజేపీ వాళ్లున్నారు: రాహుల్‌గాంధీ

    Rahul-Full-Speech.jpg

  • 2024-04-06T20:05:00+05:30

    తెలంగాణపై రాహుల్ ఆసక్తికర కామెంట్స్

    • తెలంగాణ ప్రజలు విద్వేషాల బజార్‌లో కోట్లాది ప్రేమ దుకాణాలను తెరిచారు

    • తెలంగాణ ప్రజలకు నాకు ఉన్న సంబంధం రాజకీయ సంబంధం కాదు.. మనది కుటుంబ సంబంధం

    • నా జీవితాంతం మీకు అందుబాటులో ఉంటానని మాట ఇస్తున్నాను

    • తెలంగాణ నుంచి చిన్న పిల్లోడు నన్ను పిలిచినా ఇక్కడికి వస్తాను

    • తెలంగాణ దేశంలో కొత్త రాష్ట్రం..

    • దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండాలి

    • మేడ్ ఇన్ చైనా కంటే.. మేడ్ ఇన్ తెలంగాణ పెద్ద వ్యవస్థగా మారాలి : రాహుల్

    Rahul-On-Telangana.jpg

  • 2024-04-06T20:00:43+05:30

    మహిళలకు ఏటా లక్ష!

    • తుక్కుగూడ సభావేదికగా మహిళలకు రాహుల్ కీలక హామీ

    • మహిళలకు ఏటా లక్ష రూపాయిలు నేరుగా బ్యాంకులో వేస్తాం

    • యువతకు ఏడాదికి రూ. లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తాం

    • విద్యావంతులైన యువకులకు సంవత్సరం పాటు..

    • నెలకు రూ. 8,500 ఇస్తూ, శిక్షణ ఇప్పిస్తాం

    • ఇకపై దేశంలో కుటుంబానికి ఏటా ఆదాయం రూ. లక్ష కంటే తక్కువ ఉండదు

    • మోదీ ప్రభుత్వం ధనవంతులకే రూ. 16 లక్షల కోట్లు రుణమాఫీ చేసింది

    • రైతులకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు : రాహుల్

    Rahul-On-Womens.jpg

  • 2024-04-06T19:50:14+05:30

    ఫోన్ ట్యాపింగ్‌పై రాహుల్ రియాక్షన్

    • తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం

    • తుక్కుగూడ సభావేదికగా స్పందించిన అగ్రనేత రాహుల్

    • గత ప్రభుత్వం ఇంటెలిజెన్స్, పోలీసు విభాగాలను దుర్వినియోగం చేసి వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేసింది

    • ప్రభుత్వం మారగానే ఆ డేటాను ధ్వంసం చేశారు

    • తెలంగాణలో మాజీ సీఎం ఎలాంటి పనిచేశారో..

    • ఢిల్లీలో ప్రధాని మోదీ కూడా అదే పనిచేస్తున్నారు

    • బీజేపీ ఓ వాషింగ్ మిషన్

    • దేశంలో అత్యంత అవినీతిపరులు మోదీతో ఉన్నారు

    • ఎన్నికల సంఘంలోనూ మోదీ తొత్తులున్నారు : రాహుల్

    Rahul-Tukkuguda.jpg

  • 2024-04-06T19:45:25+05:30

    ఇంకా ఉద్యోగాలిస్తాం!

    • నిరుద్యోగులకు రాహుల్ గాంధీ భరోసా

    • దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది

    • దేశ ప్రజల మనసులోని మాటే మా మేనిఫెస్టో

    • మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో ప్రజలు నిరుపేదలయ్యారు

    • ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టాం

    • తెలంగాణలో 30వేల ఉద్యోగాలు ఇచ్చాం

    • మరో 50వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం : రాహుల్

    Rahul-6-Gurarantees.jpg

  • 2024-04-06T19:30:03+05:30

    మాటిస్తున్నా.. నిలబెట్టుకుంటా!

    • న్యాయపత్రం పేరిట మేనిఫెస్టో విడుదల చేసిన రాహుల్

    • 5 గ్యారెంటీల పత్రాన్ని విడుదల చేసిన రాహుల్

    • కొన్ని నెలల కిందట తెలంగాణకు చేసిన వాగ్దానం గుర్తుంది

    • మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం

    • తెలంగాణలో హామీలు నెరవేర్చినట్లే..

    • జాతీయ స్థాయిలో కూడా మాట నిలబెట్టుకుంటాం : రాహుల్

    Rahul-6-Gurarantees.jpg

  • 2024-04-06T19:20:45+05:30

    సార్ స్పీచ్.. స్టార్ట్!

    • రాహుల్ ప్రసంగం ప్రారంభం

    • కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన రాహుల్ గాంధీ

    • హిందీలో రాహుల్ ప్రసంగం.. ట్రాన్స్‌లేటర్‌గా మంత్రి ఉత్తమ్!

    Rahul-Speech.jpg

  • 2024-04-06T19:15:30+05:30

    కేసీఆర్‌కు వార్నింగ్

    • జనజాతర వేదికగా కేసీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్

    • కేసీఆర్ ఒళ్ళు, నోరు దగ్గర పెట్టుకోవాలి

    • జవాబు చెప్పలేకనే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు

    • ప్రజల్లోకి వెళ్తే కేసీఆర్ మమ్మల్ని అరెస్ట్ చేయించేవాడు

    • మేం కేసీఆర్‌పై ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఆయనకి స్వేచ్ఛను ఇస్తున్నాం

    • మేం కూడా రాముని భక్తులమే.. మేం రాముడికి వ్యతిరేకం కాదు

    • మోదీని దించడానికే మన జనజాతర సభ

    • తుక్కుగూడ మనకి కలిసివచ్చింది

    • ఇక్కడి నుంచే మనం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం

    • ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాం

    • ఎన్నికలు కాగానే ఇచ్చిన వాగ్ధానాలు నెరవేరుస్తాం

    • బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలు.. రేపటి నుండి ప్రచార జోరు పెంచుదాం : పొన్నం

    Ponnam.jpg

  • 2024-04-06T19:10:47+05:30

    బీఆర్ఎస్‌, బీజేపీపై విసుర్లు!

    • జనజాతర సభలో మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు

    • రాజీవ్ గాంధీ చనిపోయి 34 సంవత్సరాలు అవుతోంది

    • గాంధీ కుటుంబం ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడుతోంది

    • రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి కష్టపడుదాం

    • ఉద్యోగాలు అడిగితే అయోధ్య చూపిస్తున్నారు

    • అక్షింతలు ఇంటింటికి వచ్చాయి గానీ..

    • బీజేపీ చెప్పిన హామీలు ఇంటింటికి రాలేదు

    • భారతదేశాన్ని బీజేపీ బందీ చేసింది

    • బీఆర్ఎస్ నాయకులు పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారు

    • కార్పొరేట్ కంపెనీల కోసం నల్ల చట్టాలు తెస్తున్న బీజేపీ..

    • రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తోంది

    Seethakka.jpg

  • 2024-04-06T19:00:11+05:30

    కేసీఆర్‌ను ఉరితీసినా తప్పులేదు!

    • జనజాతర సభలో మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

    • అధికారం పోయిందనే బాధలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు

    • కేటీఆర్‌ను నేనేం అనలేదు.. అయినా నోటీస్ ఇచ్చారు

    • నీ పక్కన కూర్చొని మీ అయ్య ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే సోయి లేదా కేటీఆర్..?

    • కుక్కల కొడుకులు అంటే తెలంగాణ మహిళలను తిడుతున్నారా..?

    • కేసీఆర్‌ను బహిరంగంగా ఉరి వేసినా తప్పు లేదు!

    • కాంగ్రెస్ కార్యకర్తలందరూ కేటీఆర్‌కు నోటీసులు పంపండి

    • బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నా.. జాగ్రత్తగా మాట్లాడండి

    Konda-Surekha.jpg

  • 2024-04-06T18:30:34+05:30

    సారొచ్చేశారు..!

    • హైదరాబాద్ చేరుకున్న అగ్రనేత రాహుల్ గాంధీ

    • శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన సీఎం రేవంత్

    • సాయంత్రం ఆరు గంటలకే రావాల్సి ఉన్న రాహుల్

    • అరగంట ఆలస్యంగా వచ్చిన అగ్రనేత

    Rahul-Airport.jpg

  • 2024-04-06T18:15:26+05:30

    పార్టీలో చేరేదెవరు..?

    • ‘జనజాతర’లో భారీగా చేరికలు ఉంటాయంటున్న కాంగ్రెస్

    • భారీగా చేరికలు ఉంటాయని ముందే చెప్పిన మంత్రులు, కీలక నేతలు

    • బీఆర్ఎస్, బీజేపీ నుంచి కీలక నేతలు పార్టీలో చేరే ఛాన్స్

    • సభకు కొన్ని గంటలు ముందే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న మంత్రి ఉత్తమ్

    • జీహెచ్‌ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లపై ప్రధానంగా దృష్టిసారించిన కాంగ్రెస్

    Congress-Sabha.jpg

  • 2024-04-06T18:00:28+05:30

    జనజాతరే!

    • తుక్కుగూడ జనజాతర సభలో ఎటు చూసినా జనమే!

    • 10 లక్షల మంది సభకు వస్తారని చెప్పిన కాంగ్రెస్

    • అనుకున్నదానికంటే ఎక్కువ మందే సభకు వచ్చారంటున్న కాంగ్రెస్ శ్రేణులు

    • తుక్కుగూడ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్

    • తుక్కుగూడ సభపై తెలంగాణ ప్రజలతోపాటు..

    • దేశంలోని ఇతర ప్రాంతాలు, రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తి

    • మూడు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ బావుటా ఎగుర వేసినట్లే..

    • లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తోన్న కాంగ్రెస్

    Janam-in-Jana-Jathara.jpg

  • 2024-04-06T17:50:35+05:30

    కాసేపట్లో ఎయిర్‌పోర్టుకు రాహుల్!

    • ఆరు గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కానున్న రాహుల్

    • ఎయిర్‌పోర్ట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

    • రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకునేందుకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నేతలు

    • కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

    Rahul-Gandhi.jpg

  • 2024-04-06T17:45:02+05:30

    సీతక్క ఆత్మీయ పకలరింపు!

    • మహిళా ఎమ్మెల్యేలు, నేతలను ఆప్యాయంగా పలకరించిన మంత్రి సీతక్క

    • మహిళా నేతలతో ముచ్చట్లాడిన సీతక్క

    • సీతక్కతో నవ్వుతూ మాట్లాడిన మహిళా నేతలు

    • సభావేదికపై ప్రత్యేకంగా మహిళలకు సీట్లు కేటాయింపు!

    Seethakka-With-Women-Leader.jpg

  • 2024-04-06T17:35:14+05:30

    జన జాతర ప్రారంభం

    • తుక్కుగూడలో జనజాతర సభ ప్రారంభం

    • సభావేదికపై ఆశీనులైన కాంగ్రెస్ పెద్దలు

    • కాసేపట్లో విచ్చేయనున్న ముఖ్య అతిథి రాహుల్

    • ఇప్పటికే సభా ప్రాంగణానికి విచ్చేసిన సీఎం రేవంత్, మంత్రులు

    Jana-Jathara-Sabha-Start.jpg

  • 2024-04-06T17:15:14+05:30

    జనజాతరకు భారీ బందోబస్తు

    • కాంగ్రెస్‌ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనాలు

    • భారీ బందోబస్తు నిర్వహించిన పోలీసులు

    • ముగ్గురు డీసీపీలు, ముగ్గురు అడిషనల్‌ డీసీపీలు, 12మంది ఏసీపీలు..

    • 31మంది సీఐలు, 56 మంది ఎస్సైలు, 54మంది ఏఎస్సైలు, 226 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు

    • మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 93 మంది మహిళా కానిస్టేబుళ్లు..

    • ఏఆర్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, ఇంటలిజెన్స్‌ సిబ్బంది కూడా బందోబస్తు

    Jana-Jathara-Clip.jpg

  • 2024-04-06T16:59:27+05:30

    సభాప్రాంగణానికి సీఎం

    • సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

    • స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు

    • కొద్దిసేపటి క్రితమే విచ్చేసిన తెలంగాణ మంత్రులు

    • సభా ప్రాంగణంలో కార్యకర్తలతో చర్చిస్తున్న..

    • మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క

    • అగ్రనేత రాహుల్ గాంధీకి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు పరిశీలన

    Revanth-and-Ministers.jpg

  • 2024-04-06T16:55:19+05:30

    బలం, బలగం చాటేలా..!

    • బలం, బలగం చాటేలా తుక్కుగూడ సభ

    • లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఊపు తెచ్చే వ్యూహం

    • విజయవంతంగా ఆరు హామీల అమలుపై వివరణ

    • కేంద్రంలో అధికారంలోకి వస్తే పాంచ్‌ న్యాయ్‌ అమలు!

    • తుక్కుగూడ సభపై తెలంగాణ ప్రజలతోపాటు..

    • దేశంలోని ఇతర ప్రాంతాలు, రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తి

    • మూడు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ బావుటా ఎగుర వేసినట్లే..

    • లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తోన్న కాంగ్రెస్

    • ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికలకు ముందు..

    • సొంతంగా ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభ తుక్కుగూడ జన జాతర సభే

    • జన జాతర వేదికగా బలం చాటి చెప్పి దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీలో..

    • సమరోత్సాహం నింపేందుకు కృషి చేయాలని నిర్ణయించిన అగ్రనేతలు

    Revanth-And-Rahul.jpg

  • 2024-04-06T16:45:17+05:30

    తుక్కుగూడలోనే ఎందుకు..?

    • అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ

    • మేనిఫెస్టోను ఇక్కడే రిలీజ్ చేసిన అగ్రనేతలు

    • సభ విజయవంతమే కాంగ్రెస్‌ గెలుపునకు బాటలు వేసిందంటున్న నేతలు

    • ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలని వ్యూహరచన

    • ఇక్కడే ఎన్నికల శంఖారావం చేపట్టిన కాంగ్రెస్

    • గ్రేటర్ హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి జనసమీకరణ

    • జనసమీకరణ బాధ్యత తీసుకున్న రంజిత్ రెడ్డి..

    • సునీత మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్, దానం నాగేందర్

    • సుమారు 10 లక్షలమంది సభకు హాజరవుతారని భావిస్తున్న కాంగ్రెస్

    Tukkuguda.jpg

  • 2024-04-06T16:20:21+05:30

    జనజాతరే!

    • 60 ఎకరాల్లో సభా స్థలం.. 300 ఎకరాల్లో పార్కింగ్

    • 10 లక్షల మంది జనం సభకు తరలివస్తారంటున్న కాంగ్రెస్

    • ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న రాహుల్ గాంధీ

    • కాంగ్రెస్ మేనిఫెస్టోను తెలుగులో రిలీజ్ చేయనున్న రాహుల్

    • తెలంగాణకు సంబంధించిన 23 అంశాలను మేనిఫెస్టోలో చేర్చిన ఏఐసీసీ

    • మేడారం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా

    • కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు

    • విభజన సమయంలో ఏపీలో కలిపిన 5 మండలాల్ని తెలంగాణలో కలుపుతామని కాంగ్రెస్ హామీ

    • హైదరాబాద్‌లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్పాలయం ఏర్పాటు

    Jana-Jathara.jpg

  • 2024-04-06T16:00:48+05:30

    లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Polls 2024) శంఖారావం పూరించేందుకు కాంగ్రెస్‌ (Congress) సిద్ధమైంది. తుక్కుగూడ వేదికగా పార్లమెంట్‌ ఎన్నికలకు సమరశంఖం పూరించనుంది. ఈ భారీ బహిరంగసభకు ‘జనజాతర’ (Jana Jatara) అని నామకరణం చేయడం జరిగింది. తుక్కుగూడ కాంగ్రెస్‌ పార్టీ జెండాలతో నిండిపోయింది..! ఎక్కడ చూసినా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భారీ కటౌట్లే కనిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, అగ్రనేతలు రాహుల్‌ గాంధీ హాజరు కాబోతున్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు సభకు వచ్చే వారికి మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేసేందుకు సిద్ధం చేశారు. అంతే కాకుండా ప్రతి పోలింగ్‌ బూత్‌ నుంచి పది నుంచి 20మందికి తగ్గకుండా జనాలను తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేశారు. మొత్తానికి ఈ సభకు పది లక్షల మంది హాజరు అవుతారని అంచనా వేసుకున్న కాంగ్రెస్‌ నాయకులు ఆ మేర ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు.