Home » Tungabhadra
కర్ణాటక-ఏపీ-తెలంగాణల ఉమ్మడి జలాశయం తుంగభద్ర జలాశయానికి వరద మళ్లీ పెరిగింది. తుంగ, వార్దా నదుల నుంచి ప్రవాహం పెరుగుతుండటంతో బుధవారం లోతట్టు ప్రాంతాలను తుంగభద్ర బోర్డు అప్రమత్తం చేసింది.
తుంగభద్ర జలాలు జిల్లా సరిహద్దులోకి ప్రవేశించాయి. జలాశయం నుంచి నీటిని సోమవారం ఉదయం ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి విడుదల చేశారు. దీంతో మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఆంధ్రా సరిహద్దు బొమ్మనహాళ్ వద్ద 105.272 కి.మీ. రెగ్యులేటర్ వద్దకు నీళ్లు వచ్చాయి. దీంతో హెచ్చెల్సీ అధికారులు, ఆయకట్టు రైతులు పూజలు చేసి స్వాగతం పలికారు. జలాశయంలో ఎగువకాలువ(హెచ్చెల్సీ)కి నీరు విడుదల చేసినపుడు మూడు లేదా నాలుగురోజులకు నీరు ఆంధ్రా సరిహద్దుకు చేరేవి. అయితే కర్ణాటకలో హెచ్చెల్సీ
తుంగభద్ర(Tungabhadra)కు వరదపోటు ఎక్కువ కావడంతో సోమవారం సాయంత్రం జలాశయానికి చెందిన 15,16,17 క్రస్ట్‌గేట్ల గుండా 4వేల కూసెక్కుల నీటిని నదికి వదిలారు.
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై తొలి ప్రాజెక్టు అయిన జూరాల గేట్లు తెరుచుకున్నాయి. ఈ సీజన్లో తొలిసారిగా శనివారం 17 గేట్లను ఎత్తారు. 1,04,416 క్యూసెక్కులను దిగువకు వదిలారు.
తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir)లోకి రోజురోజుకు ఇన్‌ఫ్లో ఎక్కువై నిండుకుండలా మారుతోంది. జలాశయంలో అత్యధిక ఇన్‌ఫ్లో వుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 1,08,326 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కృష్ణా-గోదావరి బేసిన్లో ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. బుధవారం కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 84 వేల క్యూసెక్కుల వరద వచ్చింది.
తుంగభద్ర జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గత రెండు రోజులుగా తుంగభద్రకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ఆదివారం ఒక్క రోజే ఐదు టీఎంసీలు నీరు వచ్చి చేరింది. దీంతో జలాశయంలో నీటి నిల్వ 18 టీఎంసీలకు చేరుకుంది. గత శుక్రవారం 19,201 క్యూసెక్కులు, శనివారం 25,556 క్యూసెక్కులుగా ఉన్న ఇనఫ్లో ఆదివారం ఉదయానికి 50,175 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో జలాశయంలో
గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన నేపథ్యంలో మే ఆఖరి, జూన్ మొదటి వారంలో కర్ణాటక రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా పడ్డాయి. కాని తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి మాత్రం ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు వరద నీరు చేరలేదు.
ఈ యేడాది తుంగ జలాశయం(Tunga Reservoir) కనివినీ ఎరుగని రీతిలో భారీ వర్షాల ప్రభావం వల్ల నిండిపోవడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి తుంగభద్ర జలాశయానికి కూడా జూన్ నెలలోనే 4 వేల క్యూసెక్కులకు పైగా రావడంతో రైతన్నలు నారుమళ్లు చల్లుకోవడానికి సిద్ధమయ్యారు.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్(Karnataka, Andhra Pradesh) రాష్ట్రాల జీవనాడిగా నిలిచిన తుంగభద్ర(Tungabhadra) ఇప్పుడిప్పుడే జల కళ సంతరించుకుంటోంది. రుతుపవనాల కారణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.