Home » UPSC
వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు(Pooja Khedkar) షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూజా ఖేద్కర్‌ను భవిష్యత్తులో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా నిషేధించింది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ కోర్టు నుంచి కూడా ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ పై వచ్చిన పలు ఆరోపణల నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్-2022లో ఆమె ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్‌గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. 2025, ఏప్రిల్ 29వ తేదీ వరకు లేకుంటే.. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం యూపీఎస్సీ సభ్యురాలిగా ఆమె కొనసాగుతున్నారు. ఆగస్ట్ 1వ తేదీన ఆమె యూపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మరో ఐదేళ్లు పదవీ కాలం ఉండగానే ఆయన బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ అంశం తెరపైకి వచ్చిన తర్వాత యూపీఎస్సీ చుట్టూ ఉన్న వివాదాలు, ఆరోపణలకు ఆయన రాజీనామాతో సంబంధం లేదని సోనీ సన్నిహితులు చెబుతున్నారు.