Home » Uttam Kumar Reddy Nalamada
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా రాయ్ బరేలికి క్యూ కట్టారు. రాహుల్ గాంధీ రాయ్ బరేలి నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. రేపు లేదా ఎల్లుండి రాయ్ బరేలిలో ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. తెలంగాణ ఎన్నికలు ముగిసినందున రాయ్ బరేలిలో ప్రచారానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లారు.
Telangana: ‘‘ప్రభుత్వాన్ని కాపాడుకునే సత్తా మాకుంది. మేం 11 మందిమి మంచి టీమ్‌గా పని చేస్తున్నాం. మా ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమీ లేదు. రేవంత్ సీఎంగా, భట్టి డిప్యూటీ సీఎంగా, మేం మంత్రులుగా కలిసి పనిచేస్తున్నాం. మేమంతా క్రికెట్ టీంలా పనిచేస్తున్నాం’’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ వ్యవస్థను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని విమర్శించారు.
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17సీట్లలో 13సీట్లు కాంగ్రెస్ పార్టీనే గెలవబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటూ రాదన్నారు. 3సీట్లలో బీజేపీతో, ఒక్క సీటులో ఎంఐఎంతో తమకు పోటీ ఉంటుందని తెలిపారు.
Telangana: తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శంకరమ్మకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. శంకరమ్మ కుటుంబం రాష్ట్రానికి చేసిన త్యాగం కాంగ్రెస్ పార్టీ మరవదని మంత్రి తెలిపారు. గురువారం శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ లోక్ సభ సీట్లను గెలుచుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 17 స్థానాల్లో కనీసం 14 సీట్లు గెలుస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయారని గుర్తుచేశారు.
Telangana: జస్టిస్ చంద్ర గోష్ కమిషన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. నేటి నుంచి బ్యారేజీలపై కమిషన్ విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో మొదటిరోజు కావడంతో కమిషన్‌ను మంత్రి ఉత్తమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్ర గోష్ కమిషన్‌కు కాళేశ్వరం అంశాలను వివరించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను మంత్రి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో భట్టి విక్రమార్క, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదా..? ఆ ఇద్దరు నేతలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ తన విశ్వరూపం చూపించేదా..? రేవంత్ అంటే ఎందుకు అంత భయం.
బీఆర్ఎస్ (BRS) పార్టీ పని అయిపోయిందని.. .పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. శుక్రవారం నాడు సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికలపై కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలపై కీలక అంశాలపై చర్చించారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతి, జై వీర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘు వీర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇండియా కూటమికి 272 స్థానాలకు పైగా గెలుచుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని తెలిపారు. రాహుల్ గాంధీ జూన్ 9వ తేదీన ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.