Loksabha Polls: తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయం.. ఎన్ని సీట్లంటే..?
ABN , Publish Date - May 08 , 2024 | 05:52 PM
తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ లోక్ సభ సీట్లను గెలుచుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 17 స్థానాల్లో కనీసం 14 సీట్లు గెలుస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయారని గుర్తుచేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ లోక్ సభ సీట్లను గెలుచుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 17 స్థానాల్లో కనీసం 14 సీట్లు గెలుస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయారని గుర్తుచేశారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం దేశంలో అత్యధిక మెజార్టీ వస్తుందని వివరించారు. మోదీ, అమిత్ షా ప్రసంగాలు చూస్తే దేశం ఏమవుతుందో అని ఆందోళనగా ఉందని ఉత్తమ్ కుమార్ అన్నారు. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు అని ప్రధాని మోదీ అంటున్నారు.. 200 కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.
‘ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయం. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. నిరాధార ఆరోపణలతో ముఖ్యమంత్రులను జైలులో వేస్తున్నారు. సన్నబియ్యం రెట్లు పెరగకుండా క్యాబినెట్‌లో చర్చించి చర్యలు తీసుకుంటాం. తడిచిన ధాన్యాన్ని కనీస మద్దతు ధఱకు కొనుగోలు చేస్తాం. తరుగు ఎక్కువగా తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచాం. చివరి ధాన్యం గింజ వరకు అంతా కొంటాం. వర్షానికి, గాలికి కొట్టుకుపోయిన ధాన్యానికి కూడా నష్ట పరిహారం ఇస్తాం. బీజేపీ, బీఆర్ఎస్ వల్లే రైతుబందు ఆగింది. ఆ రెండు పార్టీలు కలిసి రైతుబంధు ఆపాయి. రైతు బంధు ఆపడం నీచమైన కుట్ర అని’ మంత్రి ఉత్తమ్ కుమార్ విమర్శించారు.
‘తాగునీటి కోసం కర్ణాటక ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరిపింది. కర్ణాటక ప్రభుత్వంతో తాను, సీఎం రేవంత్ మాట్లాడాం. తాగునీటి కోసం కృష్ణా నది నీళ్లను ఇవ్వమని కర్ణాటకను కోరాం. నిన్న రాత్రి నుంచి కర్ణాటక ప్రభుత్వం నీరు విడుదల చేస్తోంది. 2.25 టీఎంసీ నీళ్లను విడుదల చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అని’ మంత్రి ఉత్తమ్ కుమార్ తేల్చి చెప్పారు.
Read Latest Telangana News And Telugu News