Home » V Hanumantha Rao
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశాన్ని విడదీయాలని ప్రధాని మోదీ అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి మోదీ అధికారం చేపడితే దేశం రెండు ముక్కలు అవుతుందని స్పష్టం చేశారు.
Telangana: రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ర్టంలో ఫోన్ ట్యాపింగ్‌లో ఎవరెవరు ఉన్నారో తెలియాలన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరెవరు ఏం మాట్లాడుతూన్నారో రికార్డ్ చేసిందని ఆరోపించారు. ఇందులో ఇంకా చాలా అంశాలు బయటకు రావాలన్నారు. రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్‌ల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు.
Telangana: రాష్ట్రంలో బీఆర్ఎస్ పీడ పోయిందని ఒకప్పుడున్న సీఎం రేవంత్.. ఇప్పుడు ఏం మాట్లాడటంలేదని వీహెచ్ అన్నారు. ఈ విషయంపై రేవంత్‌ను కలిసి చెబుతామంటే తనకు టైమ్ ఇవ్వడం లేదని అన్నారు. తక్కువ సమయంలో సీఎం అయింది రేవంత్ రెడ్డి ఒక్కడే అని చెప్పుకొచ్చారు. పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారని.. కానీ ఇప్పుడు పరిస్థితులు చూసి కార్యకర్తలు బాధపడుతున్నారని వీహెచ్ ఒకింత అసంతృప్తి వెలిబుచ్చారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్రలో రైతులు, పేదల కష్టాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ. వి హనుమంతరావు (V. Hanumanthao) తెలిపారు. సోమవారం నాడు ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్ హన్మంతరావు సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మం లోక్‌సభ సీటు తనకు రాకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. ‘‘భట్టి విక్రమార్క నాకు ద్రోహం చేస్తున్నారు. భట్టి ఎందుకు నన్ను అడ్డుకుంటున్నారో నాకు తెలియడం లేదు. మొదట సీటు ఇస్తా అన్నారు. ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. భట్టి ఈ రోజు పార్టీలో ఈ స్థానంలో ఉన్నాడంటే అందుకు నేనే కారణం. భట్టిని ఎమ్మెల్సీ చేసేంది నేనే’’ అని అన్నారు.