VH: మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశం రెండు ముక్కలు
ABN , Publish Date - Apr 24 , 2024 | 04:04 PM
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశాన్ని విడదీయాలని ప్రధాని మోదీ అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి మోదీ అధికారం చేపడితే దేశం రెండు ముక్కలు అవుతుందని స్పష్టం చేశారు.
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు (V Hanumantha Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశాన్ని విడదీయాలని ప్రధాని మోదీ (PM Modi) అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి మోదీ అధికారం చేపడితే దేశం రెండు ముక్కలు అవుతుందని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు మోదీ వాడే భాషపై వీహెచ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడితే 4 ఓట్లు వస్తాయని మోదీ భావిస్తున్నారు. మోదీ వాడే భాష వల్ల ఓ వర్గం ఇబ్బందికి గురవుతుందని వివరించారు. రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని, తీరు మార్చుకోవాలని వీహెచ్ సూచించారు. ప్రధాని మోదీ తీరు చూస్తే అతనిని బీసీ అని ఎవరూ అనుకోరని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీలో బీసీలకు చోటు లేదని వివరించారు. బీసీలను అణగదొక్కే పార్టీ బీజేపీ అని వీహెచ్ విరుచుకుపడ్డారు. లోక్ సభ ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ మధ్య జరుగుతున్నాయని వీహెచ్ పేర్కొన్నారు.
Read Latest Telangana News And Telugu News