Home » Vallabhaneni Balashowry
ఎంపీలు కేశినేని శివనాథ్, బాలశౌరిలకు కీలక పదవి వరించింది. మంగళగిరి ఎయిమ్స్ పాలకమండలి సభ్యులుగా ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
పదేళ్లుగా నెమ్మదిగా పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులపై పార్లమెంట్లో చర్చ జరగాలని కోరానని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో నెలకొన్న పరిస్థితి, జాప్యానికి కారణాలపై కూడా చర్చ జరగాలని కోరానని చెప్పారు.
2027 మార్చి 31నాటికి దేశవ్యాప్తంగా 25,000 జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 12,616 కేంద్రాలు నెలకొల్పినట్లు ఆమె వెల్లడించారు.
Andhrapradesh: ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం ప్రకటించడం పట్ల జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి సంతోషం వ్యక్తం చేశారు. జనసేన తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అమరావతికి రూ. 15 కోట్లు ఇస్తామన్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 200 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పూర్తి ఖర్చు కేంద్రం భరిస్తుందని చెప్పారన్నారు.
లోక్సభలో మొదటిసారిగా జనసేన పార్టీ ఎంపీలు అడుగుపెట్టారు. ఆ పార్టీ తరపున లోక్సభకు ఇద్దరు పోటీచేసి గెలిచారు. పొత్తులో భాగంగా ఎన్డీయే కూటమిలో జనసేన భాగస్వామ్యంగా ఉంది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీచేశాయి.
కృష్ణాజిల్లా: కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి అన్నారు. జనసైనికులు కూడా ఎక్కడా దాడులు, దౌర్జన్యాలకు దిగవద్దని కోరారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జనసైనికులను ఇబ్బందులకు గురి చేసిన వారిని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఏపీలో (Andhra Pradesh) మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేక ఉంది. మచిలీపట్నం కేంద్రంగా నాయకులు స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపారు. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావు ఆంధ్రపత్రికను స్థాపించి అప్పట్లో ప్రజలను స్వాతంత్య్ర ఉద్యమంవైపు మళ్లేలా చేశారు...