Home » Varla Ramaiah
అమరావతి: టీడీపీ నాయకుల ఫోన్ల టాపింగ్ వ్యవహారంపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎన్నికల కమిషన్కు లేక ద్వారా ఫిర్యాదు చేశారు. ఇంటిలిజెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఈవోని కోరారు.
అధికార వైసీపీ (YCP) అరాచకాలను పట్టించుకోకుండా కేవలం ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేస్తుండటంపై.. పోలీస్ శాఖ (Police Department) మీద టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల కోడ్ (Election Code) వచ్చిన తర్వాత కూడా పోలీస్ శాఖ బరితెగించి ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం (YSRCP Govt) బేఖాతరు చేస్తోంది. నిన్న(ఆదివారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ‘ప్రజాగళం’ సభలో ఏపీ పోలీసులు సరైన భద్రత చర్యలు తీసుకోలేదని ఏపీ సీఈఓ ఎంకే ముకేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena)కు ఎన్డీఏ కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు ఏపీ సీఈఓను టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య, జనసేన నేత బండ్రెడ్డి రామకృష్ణ, బీజేపీ నేతలు పాతూరి నాగభూషణం, బాజీ నేతృత్వంలోని ఎన్డీఏ బృందం సభ్యులు కలిశారు.
ఏపీలో వైఎస్ జగన్ కోసం చర్చి ఫాదర్లనే మభ్యపెట్టాలని చూడడం దారుణమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగసంఘాల నేత వెంకట రామిరెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా..
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (AP DGP Rajendranath Reddy) కి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య (Varla Ramaiah) సోమవారం నాడు లేఖ రాశారు. నారా లోకేష్ (Nara Lokesh) కళ్యాణదుర్గం, రాయదుర్గం శంఖారావం సభలకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో పోలీసులు విఫలం అయ్యారని మండిపడ్డారు.
అమరావతి: బాపట్ల జిల్లా, మేదరమెట్లలో జగన్ ‘సిద్ధం’ 4వ సభకు 15 లక్షల మంది వస్తారని ప్రచారం చేసుకున్న సభ అభాసుపాలైందని.. సిద్ధం సభను ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా మయసభలా మార్చారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు.
సీఎం జగన్(CM Jagan)ది విపరీత, విచిత్రమైన మనస్తత్వమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varlaramaiah) అన్నారు. జగనన్న విడిచిన బాణం నేడు ఏమైంది..? నేడు ఎందుకు ఎదురు తిరిగిందో చెప్పగలరా..? అని ప్రశ్నించారు.
కోడికత్తి కేసులో శ్రీనుకు జరిగిన అన్యాయంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ రామకృష్ణ, టీడీపీ నేత వర్ల రామయ్య, ఫారూక్ షుబ్లీ, బాలకోటయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఎన్నికలలో గెలుపు కోసం జగన్ ఆడిన డ్రామాయే కోడి కత్తి దాడి అని పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా: వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విధ్వంసం, అరాచకం వైసీపీ లక్ష్యమని దుయ్యబట్టారు.
అంబేద్కర్ పేరుని అడ్డంపెట్టుకుని వందల కోట్ల రూపాయల దోపిడీకి వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) తెరలేపిందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ( Nakka Anand Babu ) ఆరోపించారు.