Share News

Varla Ramaiah: ఆ ఇద్దరి చేతగానితనం వల్లే పోలీసులకు ఈ దుస్థితి

ABN , Publish Date - Apr 11 , 2024 | 03:02 PM

Andhrapradesh: ఏపీలో పోలీసుల ఆత్మహత్యలపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కోసం పనిచేసి పోలీస్ శాఖ చెడ్డ పేరు మూటకట్టకుందని.. జగన్ పాలనలో పోలీసు ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. పోలీసుల ఆత్మహత్యకు జగనే కారణమని ఆరోపించారు. ముఖ్యమంత్రి, డీజీపీ చేతగాని తనంతోనే పోలీసులకు ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. పోలీసు ఉద్యోగులకు రావాల్సిన సరెండర్స్ లీవ్స్ ఇవ్వడంలేదని.. టీఏ, డీఏలు ఇవ్వడంలేదని మండిపడ్డారు.

Varla Ramaiah: ఆ ఇద్దరి చేతగానితనం వల్లే పోలీసులకు ఈ దుస్థితి
TDP Leader Varlaramaiah

అమరావతి, ఏప్రిల్ 11: ఏపీలో పోలీసుల (AP Police) ఆత్మహత్యలపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ (CM Jagan) కోసం పనిచేసి పోలీస్ శాఖ చెడ్డ పేరు మూటకట్టకుందని.. జగన్ పాలనలో పోలీసు ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. పోలీసుల ఆత్మహత్యకు జగనే కారణమని ఆరోపించారు. ముఖ్యమంత్రి, డీజీపీ చేతగాని తనంతోనే పోలీసులకు ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. పోలీసు ఉద్యోగులకు రావాల్సిన సరెండర్స్ లీవ్స్ ఇవ్వడంలేదని.. టీఏ, డీఏలు ఇవ్వడంలేదని మండిపడ్డారు.

Special Trains: రూ.200తో రామాలయం టూర్.. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్


విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకరావు చావుకు జగన్ రెడ్డే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల అసోసియేట్ ప్రెసిడెంట్ జనకం శ్రీనివాసరావు చేతులెత్తేశారన్నారు. డీజీపీకి సిబ్బంది గురించి పట్టదని.. జగన్ సేవలో తరించడమే తెలుసని విమర్శించారు. ఉదాది, రంజాన్ పండుగలు చేసుకోలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారన్నారు. పదేండ్లుగా పోలీస్ వ్యవస్థలో అప్డేట్ లేదన్నారు. హౌసింగ్‌కు ఇచ్చే లోన్లను ఐపీఎస్ అధికారులే కొట్టేశారన్నారు. శంకరావు కుంటుబానికి టీటీడీ సానుభూతి తెలియజేస్తుందన్నారు.


కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులకు టీఏ, డీఏలను విడదుల చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసులకు వెంటనే టీఏ, డీఏలను విడదుల చేస్తామంటే తాము సహకరిస్తామన్నారు. పోలీసులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. సజ్జలకు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తించారు. వాలంటీర్లను బానిసులుగా వాడుకున్నారన్నారు. ‘‘వాలంటర్లకు పదివేలు ఇస్తే నీకేంటి నొప్పి సజ్జల’’ అంటూ విరుచుకుపడ్డారు. సజ్జల తీసుకునేది ప్రభుత్వ సొమ్ము అని... చేసేది జగన్‌కు సేవ అంటూ వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

YSRCP: లిస్ట్‌లో ట్విస్ట్.. కడప ఎంపీ అభ్యర్థిని మారుస్తున్న వైసీపీ!

Big Breaking: ఎమ్మెల్సీ కవిత మరోసారి అరెస్ట్..

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 11 , 2024 | 03:06 PM