Home » Venigandla Ramu
Gudivada Politics: విదర్భపురిగా.. అనేక దేవాలయాలతో గుడులవాడగా ప్రసిద్ధికెక్కిన ఘన చరిత్ర గుడివాడది. ఒకప్పుడు కృష్ణా జిల్లా(Krishna District) రాజకీయం అంతా గుడివాడ(Gudivada) చుట్టూనే తిరిగేదంటారు. వర్తక, వాణిజ్యాలతోపాటు విద్య, వైద్య, రాజకీయ రంగాల ప్రముఖులకు పెట్టింది పేరు ఈ గడ్డ. టీడీపీ(TDP) ఆవిర్భావం నుంచి ఏడుసార్లు నెగ్గి అభివృద్ధికి బాటలు వేసి గుడివాడ పేరును..
Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో సమస్యలపై నిలదీసిన ప్రజలపై ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల దాడి తీవ్ర కలకలం రేపింది. గుడ్లవల్లేరు మండలం కూరాడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ‘‘త్రాగునీరు రావడం లేదు.. రోడ్లు లేవు... లైట్లు లేవు’’ అంటూ కొడాలి నానిని గ్రామస్థులు ప్రశ్నించారు. అయితే వారిపై దుర్భాషలాడుతూ ఎమ్మెల్యే నాని అనుచరులు దాడికి దిగారు. విషయం తెలిసిన టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము... కూరాడ వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు.
Andhrapradesh: టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్ దాఖలు చేశారు. రాము నామినేషన్ కార్యక్రమంలో గుడివాడలో ఘనంగా జరిగింది. వేలాది మందితో గుడివాడ పట్టణ ప్రధాన రోడ్లపై రాము భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు, మాజీ కౌన్సిలర్ నేరసు చింతయ్యలతో కలిసి రిటర్నరింగ్ అధికారికి రాము నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...
టీడీపీ నేతలకు ర్యాలీకి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. బారికేడ్లు అడ్డుపెట్టి నానా హంగామా చేస్తున్నారు. తొలుత అనుమతి ఇచ్చి.. తర్వాత వైసీపీ నేతల మాటలకు తలొగ్గి తమను ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇవాళ కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము నామినేషన్ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరారు.
కృష్ణా జిల్లా: గుడివాడ రూరల్ వైసీపీకి గట్టి షాక్ తగిలింది. బిల్లపాడు గ్రామానికి చెందిన 100 మంది వైసీపీ కార్యకర్తలు.. వెనిగండ్ల రాము సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఈ క్రమంలో గుడివాడ రూరల్ వైసీపీ ఖాళీ అవుతోంది.
Andhrapradesh: గుడివాడలో ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ చేప్టటారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి గుడివాడ ప్రధాన వీధుల గుండా టీడీపీ కార్యాలయం వరకు జరిగిన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైకిల్ తొక్కుతూ పార్టీ శ్రేణులను రాము - సుఖద దంపతులు ఉత్సాహపరిచారు.
Andhrapradesh: ‘‘గుడివాడకు ఏం చేశాడో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా’’ అంటూ మాజీ మంత్రి కొడాలి నానికి గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము సవాల్ విసిరారు. గురువారం రాము సమక్షంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. 19వ వార్డు వైసీపీ ఇన్చార్జ్ గణపతి సూర్జంతో పాటు 100 మంది యువత టీడీపీ కండువా కప్పుకున్నారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ గుడివాడ అభ్యర్థి వెనిగండ్ల రాము (Venigandla Ramu) అన్నారు. గుడివాడలో సీఎం జగన్ (CM JAGAN) ‘మేమంతా సిద్ధం’ సభలో అబద్ధాలు చెప్పారని ఎద్దేవా చేశారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ.. ఈ సభ పేరుతో సీఎం జగన్ గుడివాడ వచ్చి పిట్టలదొర కబుర్లు చెప్పారని సెటైర్లు వేశారు.
Andhrapradesh: గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత ఒకరు వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు. వైసీపీ నాయకుడు షేక్ మౌలాలి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. శనివారం గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో మౌలాలి పార్టీలో చేశారు. మౌలాలికి వెనిగండ్ల రాము పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. మౌలాలితో పాటు అతని అనుచురులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అధికారపార్టీకి షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. రాక్షస పాలన వద్దు - రామునే కావాలి అంటూ టీడీపీలోకి చేరుతున్నారు. అధికార పార్టీకి షాక్ మీద షాక్ ఇస్తూ నిన్న (శుక్రవారం) నందివాడ, నేడు గుడ్లవల్లేరు మండలాల్లో టీడీపీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. టీడీపీ నేత వెనిగండ్ల రాము సమక్షంలో వైసీపీ వైస్ సర్పంచ్ సహా 100 మంది వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు.