AP Elections: నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము... ఆపై కొడాలిపై విసుర్లు
ABN , Publish Date - Apr 23 , 2024 | 02:59 PM
Andhrapradesh: టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్ దాఖలు చేశారు. రాము నామినేషన్ కార్యక్రమంలో గుడివాడలో ఘనంగా జరిగింది. వేలాది మందితో గుడివాడ పట్టణ ప్రధాన రోడ్లపై రాము భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు, మాజీ కౌన్సిలర్ నేరసు చింతయ్యలతో కలిసి రిటర్నరింగ్ అధికారికి రాము నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...
కృష్ణా జిల్లా, ఏప్రిల్ 23: టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము (TDP Candidate Venigandla Ramu) నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. రాము నామినేషన్ కార్యక్రమంలో గుడివాడలో ఘనంగా జరిగింది. వేలాది మందితో గుడివాడ పట్టణ ప్రధాన రోడ్లపై రాము భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు, మాజీ కౌన్సిలర్ నేరసు చింతయ్యలతో కలిసి రిటర్నరింగ్ అధికారికి రాము నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గుడివాడ ప్రజల తరపున ఎన్డీఏ బలపర్చిన టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు తెలిపారు.
Breaking: కవితకు మరో బిగ్ షాక్.. ఇప్పట్లో కష్టమే!
అశేషంగా తరలి వచ్చిన గుడివాడ ప్రజానీకానికి చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. తమ విజయం ఈ రోజుతో తేటతెల్లం అయిందన్నారు. గుడివాడ ప్రజల చైతన్యం ఏంటో ఈరోజు ప్రపంచానికి తెలిసిందని తెలిపారు. ఉన్మాది పాలనలో దారుణ పరిస్థితుల్లో గుడివాడ ఉందని వ్యాఖ్యలు చేశారు. రోడ్లు లేవు... డ్రెయిన్లు లేవు... ఉపాధి... ఉద్యోగాలు లేవు.... కనీసం త్రాగునీరు కూడా లేక ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు.
కొడాలి నానిపై విసుర్లు...
గుడివాడ రోడ్లన్నీ పసుపుమయం అయ్యి... ప్రజలతో నిండి పోయాయని.. ప్రజల ఆక్రోశాన్ని ఈరోజు బయటపెట్టారని తెలిపారు. మూడు సార్లు అధికారంలో లేను మరో అవకాశం ఇవ్వాలని ప్రజలని అభ్యర్థించి గెలిచారని.. అధికారంలోకి వచ్చాక నమ్మి గెలిపించిన ప్రజలను నట్టేట ముంచారంటూ విమర్శలు గుప్పించారు. ‘‘అధికారం వచ్చింది.... మంత్రి అయ్యాడు.. ఎన్నో అవకాశాలు వచ్చినా... ప్రజల సమస్యలను కనీసం పట్టించుకోలేదు. ఐదేళ్లపాటు దోచుకోవడం.... దాచుకోవడమే లక్ష్యంగా పనిచేశాడు. పౌర సరఫరాల మంత్రిగా ధాన్యం కొనుగోళ్లలో చేసిన అవినీతిని వెలికి తీసి.. టీడీపీ ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటాం. మంత్రి అయిన తర్వాత తన అధికారాన్ని భూ కబ్జాలు, మైనింగ్ మాఫీయాలకే ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రజల సమస్యలు అంటే కొడాలి నానికి చిన్న చూపు... క్యాసినో , జూధా క్రీడలు, గంజాయి అమ్మకాల్లో గుడివాడ ఎంతో అభివృద్ధి చెందింది’’ అంటూ దుయ్యబట్టారు.
AP Elections: జడ్జి ముందు ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఎందుకంటే..?
అదే నా ఆశయం..
గుడివాడను అభివృద్ధి చేసుకోవడమే తన ఆశయమని స్పష్టం చేశారు. గెలిస్తే వెళ్ళిపోతాను అంటున్నారని.... వెళ్లిపోవడానికి గెలవడం ఎందుకు అని రాము ప్రశ్నించారు. గుట్కా నాని కళ్లబొళ్ళు మాటలను... విశ్వసించని ప్రజలు ఈరోజు తన నామినేషన్‌లో వేలాదిగా పాల్గొన్నారని అన్నారు. నేడు వచ్చిన అశేష ప్రజానీకాన్ని చూసిన వారికి ఎవరికైనా.. గుడివాడ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని స్పష్టమవుతుందన్నారు. దుర్మార్గుడు... నరకాసుడు లాంటి వ్యక్తిపై ప్రజలు తిరుగు బాటు చేస్తున్నారని చెప్పారు. ప్రజలతో కలిసి నడుస్తానని... కోల్పోయిన 20 ఏళ్ల అభివృద్ధిని 5ఏళ్లలో చూపిస్తానని హామీ ఇచ్చారు. ‘‘నా గుడివాడను.... 5 ఏళ్ల తర్వాత చూడండి.... కొత్త గుడివాడను ప్రజలందరికి అందిస్తాను. ర్యాలీ విజయవంతం కావడంతో కుళ్ళుతో ర్యాలీని అడ్డుకునేందుకు గడ్డం గ్యాంగ్ చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి పోలీసులతో లాఠీ ఛార్జ్ చేయించినా ఒక్కరు కూడా వెనకడుగు వెయ్యలేదు’’ అని వెనిగండ్ల రాము పేర్కొన్నారు.