Home » Vijayawada Durga Temple
Andhrapradesh: మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నానని.. ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు అన్నీ పరిశీలించినట్లు హోంమంత్రి తెలిపారు. క్యూ లైన్లో భక్తులతో కూడా మాట్లాడానని.. అందరూ ఏర్పాట్లు బాగున్నాయని ఆనందాన్ని వ్యక్తపరిచారని తెలిపారు.
Andhrapradesh: ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఏర్పాటు చేసిన సదుపాయాలు, సౌకర్యాలను స్వయంగా హోం మినిస్టర్ అనితతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) బుధవారం పరిశీలించారు. క్యూ లైన్లోని భక్తులతో మాట్లాడి ఆలయ ఏర్పాట్లపై అభిప్రాయాలను హోంమంత్రి, ఎంపీ అడిగి తెలుసుకున్నారు.
దసరా మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. తొమ్మది రోజులపాటు జరిగే అమ్మవారి ఉత్సవాలకు భక్తులు భారీగా వస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఉత్సవాల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేశారు.
Andhrapradesh: దేవి నవరాత్రులను అద్భుతంగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఇవాళ దర్శనాలు సజావుగా ప్రారంభమయ్యాయని.. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పిస్తామని చెప్పారు.
Andhrapradesh: రోజుకొక రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాలను భక్తులకు దర్శనమిస్తుంటారు అమ్మవారు. నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవగా.. చివరి రోజు దుర్గాష్టమితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.
ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు తన చేతుల మీదగా జరగడం చాలా సంతోషంగా ఉందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. తన కుటుంబంతోపాటు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ దుర్గమ్మ వారిని కోరుకున్నట్లు తెలిపారు.
ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు హైదరాబాద్లోని భాగ్యనగర్ మహంకాళి అమ్మవారి ఉమ్మడి దేవాలయ కమిటీ కాసేపట్లో బంగారు బోనం సమర్పించనుంది. మహంకాళి జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఛైర్మన్ రాకేష్ తివారి ఆధ్వర్యంలో బోనం సమర్పించనున్నారు. ప్రతి ఏడాది అమ్మవారికి బంగారు బోనం ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నట్లు జోగిని విశాక్రాంతి చెప్పారు.