Share News

Vijayawada: భవానీపై ఒక్క గీత పడినా ఊరుకోను

ABN , Publish Date - Dec 18 , 2024 | 12:14 PM

విజయవాడలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులకు కీలక సూచనలు చేశారు.

Vijayawada: భవానీపై ఒక్క గీత పడినా ఊరుకోను

విజయవాడ, డిసెంబర్ 18: భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో జరుగుతోన్న ఏర్పాట్లలో భాగంగా ఇంజనీరింగ్ విభాగం అధికారుల పనితీరుపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క భవానీకి గీత బడిన ఊరుకోనంటూ ఇంజనీరింగ్ విభాగం అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయా శాఖ అధికారులకు కీలక సూచనలు చేశారు.

Also Read: ఊపిరందక ఆరుగురి మృతి.. నలుగురికి తీవ్రగాయాలు


భవానీ దీక్ష విరమణ నేపథ్యంలో ఏర్పాట్లును ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బుధవారం ఉదయం పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భవానీలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాలినడకన వచ్చే భవానీలకు హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశామని వివరించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశామన్నారు. వారి కోసం ప్రత్యేకంగా వాష్ రూమ్స్‌తోపాటు టాయిలెట్స్ సైతం సిద్ధం చేశామన్నారు.

Also Read: పీటల మీద ఆగిన ఐపీఎస్ వివాహం... కార్యకర్తలు ఆందోళన


నగర సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ..

భవానీ భక్తుల కోసం ఏర్పాటు చేసిన యాప్ ద్వారా ఎంత మంది భవానీలు వస్తున్నారో ముందుగానే తెలుసుకో వచ్చునని నగర పోలీస్ కమిషనర్ సీపీ రాజశేఖర బాబు వెల్లడించారు. డ్రోన్స్ ద్వారా పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నామన్నారు. భవానీల దీక్ష విరమణ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 3 వేల మంది పోలీసులను బందోబస్తునకు వస్తున్నారని వివరించారు. ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు.. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని చెప్పారు.


ఇప్పటికే శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని తెలిపారు. అలాగే పోలీసులు, వీఎంసీ, ఆలయ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్ అందరం భవానీ దీక్ష విరమణల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. అయితే వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదే విధంగా అన్న వితరణకు సంబంధించిన ఏర్పాట్లను సైతం దగ్గరుండి పరిశీలిస్తున్నామని చెప్పారు.

Also Read: ఏపీ మళ్లీ భారీ వర్షాలు..


విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ద్యాన్ చంద్ర మాట్లాడుతూ.. దూర ప్రాంతాల నుంచి వచ్చే భవానీలకు క్యూలైన్లో మంచి నీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. శానిటేషన్‌ కోసం వెయ్యి మందికి పైగా సిబ్బందిని బయట నుంచి తెప్పించామని తెలిపారు. భవానీలు విడిచిన దుస్తులు ఎప్పటికప్పుడు తొలగించేందుకు సిబ్బందిని సైతం నియమించామని చెప్పారు. భవానీలు ఎవరైనా తప్పిపోతే.. వారు సమాచార కేంద్రానికి వచ్చే విధంగా మైకులను ఏర్పాటు చేసి ప్రచారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. పోలీస్ అధికారులు, వియంసి సిబ్బంది సమన్వయంతో భవాని దీక్ష విరమణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఈ సందర్భంగా కమిషనర్ ద్యాన్ చంద్ వెల్లడించారు.

Also Read: బెల్లం పానకం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గమ్మ వారిని భవానీ దీక్షలో భక్తులు కొలుస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో భక్తులు.. భవానీ దీక్ష విరమణ చేయనున్నారు. అందుకోసం లక్షలాది మంది భక్తులు విజయవాడకు పోటెత్తనున్నారు. ఈ నేపథ్యంలో భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లను బుధవారం ఉదయం జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ లక్ష్మీ షా, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు, మున్సిపల్ కమిషనర్ ద్యాన్ చంద్ర తదితరులు పరిశీలించారు. మరోవైపు ఓ యాప్ ‌ను సైతం రూపొందించారు. ఈ యాప్ ద్వారా దుర్గ గుడికి ఎంతమంది భవానీలు వచ్చారనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే దుర్గ గుడిలో అమ్మవారిని దర్శించుకోనేందుకు ముందుగానే యాప్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ యాప్‌ను ఇటీవలే భక్తులకు అందుబాటులోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.

For Andhrapradesh news And Telugu News

Updated Date - Dec 18 , 2024 | 12:14 PM