Home » Vinayaka Chavithi
గణపతి నవరాత్రులు మరికొన్ని గంటల్లో ముగియనున్నాయి. అలాంటి వేళ కృష్ణాజిల్లా పెడన పట్టణంలోని వినాయకుడి పందిరిపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో ఓ వర్గం ఆందోళనకు దిగింది. అందుకు ప్రతిగా మరో వర్గం వినాయకుడి పందిరికి ఎదురుగా జెండాలు కట్టింది.
ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. గంటకు సరాసరి మూడు నుంచి ఐదు వేల మంది దర్శనం చేసుకుంటున్నారు. ప్రధానంగా వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత..
కర్ణాటకలోని మాండ్య జిల్లాలో నాగమంగళ పట్టణంలో వినాయకుడి ఊరేగింపుపై రాళ్ల దాడి జరిగింది. అనంతరం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనకు సంబంధించి 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గణేష్ నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు శుక్రవారం కీలక నిబంధనలు ప్రకటించారు. నిమజ్జనం రోజున పాటించాల్సిన ముందస్తు నియమాలను వెల్లడించారు. గణేష్ ఉత్సవ కమిటీ సమితి సభ్యులు విగ్రహాలను తీసుకెళ్లడానికి అవసరమైన వాహనాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
వినాయక చవితి పురస్కరించుకుని హిందూపురంలో ఏర్పాటు చేసిన విగ్రహాల నిమజ్జన కార్యక్రమం శుక్రవారం జరు గనుంది. ఈ సందర్భంగ్లా ఎస్పీ రత్న గురువారం సాయంత్రం వినాయక విగ్రహా లు తరలివెళ్లే రహదారులను పరిశీలించారు. శోభయాత్ర ఏర్పాట్లపై ఆరాతీశారు. అనంతరం గుడ్డం కోనేరువద్ద భద్రత ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్‌పై పరిశీలిం చారు. ముఖ్యంగా పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు.
నవరాత్రి ఉత్సవాల వేళ వినాయకుడి ఊరేగింపు సందర్బంగా మాండ్య జిల్లాలోని నాగమంగళ పట్టణంలో మత ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించి 52 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు గురువారం వెల్లడించారు.
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలో విగ్రహాల నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరిగిం ది. ఈ సందర్భంగా మండపాల వద్ద గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి సీబీరోడ్డు, యల్లనూరురోడ్డు, పుట్లూరురోడ్డు, మెయినబజారు, గాంధీకట్ట మీదుగా ఊరేగించారు. దాదాపు 200 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు.
అనంతపురం నగరంలో ఐదురోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడు బుధవారం గంగమ్మ ఒడికి చేరారు. అంతకు మునుపు మండపాల వద్ద పెద్దఎత్తున అన్నదానం చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సప్తగిరి సర్కిల్లోని వినాయక్ చౌక్ వరకూ శోభాయాత్రలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి దారిపొడవునా భక్తులు బారులు తీరారు. ఆకట్టుకునే వేషధారణలతో రంగులు చల్లుకుంటూ యువత ఉత్సాహంగా వేడుకలలో పాల్గొంది. వినాయక్ ...
పట్టణంలో వినాయక మండపాల వద్ద నాలుగోరోజు మంగళవారం పూజలు కొనసాగాయి. పలు మండపాల వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని బుధవారం ఘనంగా నిర్వహించనున్నా రు. ఉదయం 10గంటలకు ప్రత్యేక పూ జల అనంతరం విగ్రహాలను ప్రత్యేక వాహనాల్లో ఉంచి ఊరేగింపుగా మఽధ్యా హ్నానికి ప్రధాన రహదారి సీబీరోడ్డుకు తీసుకురానున్నారు.
దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో విభిన్న రీతుల్లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో గణనాధునికి నైవేద్యంగా పలు రకాలు స్వీట్లు, పిండి పంటలు నిర్వాహాకులు సమర్పిస్తున్నారు. వినాయకుడిని అత్యంత ప్రీతిపాత్రమైన జాబితాలో కుడుము