Home » Volunteer
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీలో కొందరు చేతివాటం చూపించారు..
ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందనేది పక్కనపెడితే.. లక్షమందికి పైగా యువత ఉపాధి కోల్పోవడానికి మాత్రం ఆ పార్టీ నాయకులు కారణమయ్యారు. వైసీపీ నాయకులు మాటలు నమ్మిన గ్రామ, వార్డు వాలంటీర్లు ఎన్నికల ప్రచారం కోసం తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
మొన్నటి దాకా వలంటీర్లంతా తమ వారేనన్నారు. పార్టీ కోసం అడ్డగోలుగా వాడుకున్నారు. ఎన్నికల ముందు చాలామందితో రాజీనామా చేయించి మరీ ప్రచారం చేయించుకున్నారు. అవసరం తీరిపోవడంతో ఇప్పుడు వైసీపీ నేతలు మొహం చాటేస్తున్నారు. పాపం... వలంటీర్లు పావులుగా మారిపోయారు
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన అంతా మాయేనని, లేని పొలం ఉన్నట్టు చూపుతూ రైతు భరోసా పడింది కనుక మీ బిడ్డను ఆశీర్వదించాలంటూ ఓ వాలంటీర్ తనకు కరపత్రం అందజేశాడని ఓ మహిళ పేర్కొంది. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైసీపీ కుట్రలను తిప్పకొట్టేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసైనికులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి పెన్షన్లు అందించకుండా.. మండు టెండలో వృద్ధులు గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీలో వలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీని నిలువరిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. వలంటీర్లు వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కదా అని వాఖ్యానించారు. వలంటీర్లపై వచ్చిన ఫిర్యాదులు పరిగణలోకి తీసుకొని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది.
మహిళా వలంటీర్‌తో మాజీ మంత్రి కొడాలి నాని కాళ్లు కడిగించుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుడివాడలో మహిళలతో కాళ్లపై కొడలి నాని పాలాభిషేకం చేయించుకోవడంపై తీవ్ర విమర్శలు వినవస్తున్నాయి. ముఖానికి ముసుగేసుకుని మరీ సదరు మహిళ వలంటీర్ కొడాలి నాని కాళ్లు కడిగింది.