Amaravati: వైసీపీ పాలన అంతా మాయే.. వైరల్ అవుతున్న మహిళ వీడియో..
ABN , Publish Date - Apr 07 , 2024 | 10:43 AM
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన అంతా మాయేనని, లేని పొలం ఉన్నట్టు చూపుతూ రైతు భరోసా పడింది కనుక మీ బిడ్డను ఆశీర్వదించాలంటూ ఓ వాలంటీర్ తనకు కరపత్రం అందజేశాడని ఓ మహిళ పేర్కొంది. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) పాలన అంతా మాయేనని, లేని పొలం (Farm) ఉన్నట్టు చూపుతూ రైతు భరోసా (Raigu Barosa) పడింది కనుక మీ బిడ్డను ఆశీర్వదించాలంటూ ఓ వాలంటీర్ (Volunteer) తనకు కరపత్రం అందజేశాడని ఓ మహిళ (Women) పేర్కొంది. ఇప్పుడది సోషల్ మీడియా (Social Media)లో వైరల్ (Viral) అవుతోంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ గుణదల ప్రాంతానికి చెందిన ఓ మహిళకు గతంలో వాలంటీర్ కరపత్రాన్ని అందజేశాడు. దీంతో తన పొలం ఎక్కడ ఉందో చూపించాలని.. ఏ అకౌంట్లో సొమ్ములు పడ్డాయో చెప్పాలంటూ ఆమె వాలంటీర్‌ను నిలదీసింది. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదేవిధంగా చాలామందికి జరుగుతోందని ప్రజలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా వేరు వేరు పేర్లతో పథకాల పేరు చెప్పి డ్రా చేసిన డబ్బులేమవుతున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు.