Home » Vyuham
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలిగాయి. హైకోర్టు సూచనలతో వ్యూహం సినిమాకు రెండో సారి సెన్సార్ నిర్వహించారు. దీంతో సినిమాకు సెన్సార్ అడ్డంకులు తొలిగిపోయాయి.
‘వ్యూహం’ సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ రోజు తీర్పు ఇవ్వనుంది. సినిమా విడుదల నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న వ్యూహం(Vyuham Movie) సినిమాపై తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు వాయిదా వేసింది. తీర్పును జనవరి 22కు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. అప్పటివరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని తెలిపింది.
Telangana: టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘‘వ్యూహం’’ సినిమాపై కమిటీ వేయాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. వ్యూహం సినిమాపై ఈరోజు హైకోర్టులో విచారణకు వచ్చింది.
వ్యూహం సినిమాపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కించ పరిచేలా సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్ దాఖలైంది. దీంతో సినిమా విడుదలను హైకోర్టు నిలిపివేసింది. నేడు సినిమా రికార్డ్స్ అన్నిటిని న్యాయ స్థానం పరిశీలించునుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో సినిమా యూనిట్ అప్పీల్ చేసింది.
వ్యూహం మూవీ విడుదలకు కొన్ని గంటలకు ముందే రిలీజ్ ఆపాలని తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ఈ చిత్రం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.