TS High Court: ‘వ్యూహం’ సినిమా విడుదలపై నేడు హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు
ABN , Publish Date - Jan 31 , 2024 | 09:14 AM
‘వ్యూహం’ సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ రోజు తీర్పు ఇవ్వనుంది. సినిమా విడుదల నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు (High Court) డివిజన్ బెంచ్ ఈ రోజు తీర్పు ఇవ్వనుంది. సినిమా విడుదల నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యూహం సినిమా చిత్రీకరించారని తెలిపారు. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీచేసింది. దాంతో వ్యూహం సినిమా విడుదల వాయిదా పడింది. దాంతో వ్యూహం చిత్ర యూనిట్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. సినిమా విడుదల విషయంలో జాప్యం జరిగితే తనకు భారీ నష్టం జరుగుతుందని సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తెలిపారు. వ్యూహం సినిమా విడుదలపై డివిజన్ బెంచ్‌లో వాదనలు జరుగుతున్నాయి. ఈ రోజు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.