Home » West Godavari
పశ్చిమ గోదావరి జిల్లా: నరసాపురంలో భారీ దొంగతనం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్లో రూ. 11 లక్షల నగదు, 4 వందల గ్రాముల బంగారం బ్యాగ్ చోరీకి గురైంది. గుంటూరుకు చెందిన ఓ వ్యాపారి నరసాపురం నుంచి నగదు బంగారం తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగింది.
Andhrapradesh: ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచామని... పొద్దు పొద్దున్నే అందించామని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. సోమవారం ఉదయం పెనుగొండలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైసీపీ హయంలో పెన్షన్ వెయ్యి పెంచడానికి నాలుగేళ్లు పట్టిందని విమర్శించారు.
ప.గో.జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన మానవతా వాది స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
AP News: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామ ప్రజలు హడలిపోయారు. ఊహించని ఘటనతో బెంబేలెత్తిపోయారు. అంతంత మాత్రమే నీళ్లు వచ్చే బోరు బావి నుంచి ఒక్కసారిగా 15 మీటర్ల మేర నీళ్లు ఎగసిపడ్డాయి.
తణుకు(Tanuku) మండలం దువ్వ గ్రామం(Duvva village)లో దారుణం జరిగింది. ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఘర్షణ ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది.
ఆంధ్ర రాష్ట్ర సంపదను మాజీ ముఖ్యమంత్రి జగన్ కొల్లగొట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ మీద ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు. దేశం నుంచి బ్రిటిష్ వారిని ఎలా తరిమారో.. రాష్ట్రం నుంచి జగన్ను ప్రజలు తరిమికొట్టారని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ఖాజానా మొత్తం ఖాళీ అయ్యిందని పేర్కొన్నారు.
అదృష్టం ఉంటే చాలు.. దేనికోసం మనం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు.. అదే మన అడ్రస్ వెతుక్కుంటూ వస్తుందనే సామెత ఆయనకు సరిగ్గా సరిపోతుంది. ఎంపీ టికెట్ కోసం పైరవీలు చేయలేదు.. పార్టీ కోసం కష్టపడి పనిచేయడమే ఆయనకు తెలుసు.. టికెట్ కావాలంటూ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టలేదు.. అధిష్టానం పెద్దలను అడగలేదు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎంతలా అంటే ఫ్యాన్ సునామీనే.. వైనాట్ 175 దగ్గర్నుంచి ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న పరిస్థితి. కేవలం సింగిల్ డిజిట్లోనే అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ పట్టుమని పది మంది కూడా గెలవని దుస్థితి వైసీపీకి రావడం గమనార్హం...
ఆంధ్రప్రదేశ్ భౌగోళిక, సాహితి, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే గీత రచన పోటీలు నిర్వహిస్తున్నామని, ఎంపికైన గీతానికి రూ.లక్ష బహుమానం అందజేస్తామని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు
ఏలూరు జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు బుధవారం చిన వెంకన్న స్వామి మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.