Home » Yadadri Bhuvanagiri
మతం మారిన వారికి త్వరితగతిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యేలా నకిలీ ధ్రువపత్రాలను తయారు చేసే ముఠా ఆటను యాదాద్రి-భువనగిరి జిల్లా పోలీసులు కట్టించారు.
జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) నుంచి అనుమతులు రాని నాలుగు కొత్త వైద్య కళాశాలలపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పాత ఆచారాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 11 నుంచి కొండపై ఉన్న విష్ణు పుష్కరిణిలో స్నానం చేసేందుకు అనుమతిస్తోంది. ఇందుకోసం దంపతులు, భక్తులకు రూ.500 టికెట్ ధర నిర్ణయించి ఆర్జిత సేవల జాబితాలో చేర్చనుంది.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో రూ.15 వేల కోట్ల దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులోనూ మెగావాట్‌కు రూ.రెండున్నర కోట్ల చొప్పున అంచనా పెంచి.. మొత్తంగా రూ.రెండున్నర వేల కోట్లు దిగమింగిందెవరో లెక్కతేలాలన్నారు.
ప్రసిద్ధ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆయన ఆదివారం లక్ష్మీనృసింహుడిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.
వచ్చే అక్టోబరుకల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎ్‌స)లోని మొదటి దశలో రెండు యూనిట్లు(ఒక్కోటి 800 మెగావాట్లు) పూర్తి కావాలని ఇంధన శాఖ కార్యదర్శి, జెన్కో సీఎండీ రొనాల్డ్‌రాస్ ఆదేశించారు.
హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట క్షేత్రానికి వెళ్లే భక్తులకు రద్దీ పరంగా త్వరలోనే ఊరట లభించే అవకాశాలున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సహా గ్రేటర్ పరిఽధిలో వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలోనూ నారసింహుడి సన్నిధికి భక్తులు వెళ్లొచ్చు!
యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది. స్వామి వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని సుమారు 8వేల మంది భక్తులు గిరిప్రదక్షిణలో భాగస్వామ్యులయ్యారు.
యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీ నరసింహస్వామి కొండ చుట్టూ సోమవారం ఉదయం సామూహిక గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు పాల్గొన్నారు.
పంటల సాగు కోసం చేసిన అప్పులు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. రెండేళ్ల క్రితం తండ్రి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా, కుమారుడు అదే సమస్యతో ఆయువు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాకలో జరిగింది.