Share News

Kavitha: మా జోలికి వస్తే కబడ్దార్...

ABN , Publish Date - Jan 22 , 2025 | 04:07 PM

MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూసీని ఏటీఎంగా మార్చుకొని వచ్చిన డబ్బులను ఢిల్లీ పంపిస్తున్నారని ఆరోపించారు. రౌడీ మూకలతో దాడులు చేసే సంస్కృతి బీఆర్ఎస్‌ది కాదన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా మా జోలికి వస్తే ఖబడ్దార్’’ అంటూ హెచ్చరించారు.

Kavitha: మా జోలికి వస్తే కబడ్దార్...
BRS MLC Kavitha

యాదాద్రి, జనవరి 22: కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నీటిని కాకుండా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదల ఇళ్లను ప్రక్షాళన చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC Kavitha) కవిత వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మూసిని గోదావరితో అనుసంధానం చేయడానికి 1700 కోట్లతో కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. మళ్లీ రూ.7500 కోట్లతో మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకురావడానికి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. మూసీని ఏటీఎంగా మార్చుకొని వచ్చిన డబ్బులను ఢిల్లీ పంపిస్తున్నారని ఆరోపించారు.


రౌడీ మూకలతో దాడులు చేసే సంస్కృతి బీఆర్ఎస్‌ది కాదన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా మా జోలికి వస్తే ఖబడ్దార్’’ అంటూ హెచ్చరించారు. అప్లికేషను ఇవ్వగానే అన్ని ఇస్తాం అన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం నుంచి నీళ్లు విడుదల చేయకుండా రైతుల పంటలను ఎండ బెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని విమర్శించారు. నల్లగొండ మేథావుల్లారా కృష్ణ జలాలతో అన్యాయం జరుగుతుందని..ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు ఒక్కటే అని ఎమ్మెల్సీ వ్యాఖ్యలు చేశారు.

సైఫ్ కేసు.. వాళ్లే చంపాలనుకున్నారా


తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట అని కవిత అన్నారు. కేసీఆర్ రూ.1200 కోట్లను పెట్టి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రాజకీయాలకు అతీతంగా యాదాద్రి అభివృద్ధి జరగాలన్నారు. లక్ష్మీనరసింహ స్వామి పుష్కరిణిని విరజానది పుష్కరిణిగా భావిస్తారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ గిరి ప్రదక్షిణలో పాల్గొనాలని కోరారు. మెట్ల ద్వారా స్వామివారి దర్శనం చేసుకుంటే గిరి ప్రదక్షిణం పూర్తవుతుందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సంవత్సర కాలంలో అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. ప్రజలకు సేవ చేయడానికి లక్ష్మీనరసింహస్వామి వారి దీవెనలు ఇవ్వాలని కోరుకున్నట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.


ఈరోజు ఉదయం నుంచి ఆపరేషన్‌ రోప్‌లో భాగంగా చింతల్‌ బస్తీలో జీహెచ్‌ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆ మార్గంలో ఉన్న అక్రమనిర్మాణాలు, రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలను ఎక్కడికక్కడ తొలగించే చర్యలు చేపట్టారు. కూల్చివేతలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కూల్చివేతల అంశాన్ని ఎమ్మెల్యే దానం దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. దీంతో వెంటనే దానం అక్కడకు చేరుకుని అక్కడి అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి కూల్చివేతలు చేయొద్దన్ని అనేక సార్లు చెప్పానని.. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ ధమ్కీ ఇచ్చిన పరిస్థితి. ఎమ్మెల్యే ఇచ్చిన వార్నింగ్‌తో అధికారులు వెనక్కి తగ్గారు. వెంటనే అధికారులు అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. అయితే ఇటీవల కాలంలో దానం నాగేందర్‌ ఏదో విధంగా హాట్‌కామెంట్స్‌ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కానీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే ఇలా కూల్చివేతలను అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. దానంకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

BRS.. దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్

Hyderabad: గ్రేటర్‌లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 22 , 2025 | 04:28 PM