Home » Yarlagadda Venkatrao
నిన్ను రైటు అనుకుంది నేడు రాంగ్ అవుతుంది... నేడు రాంగ్ అనుకున్నది రేపు రైట్ అవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థుల విషయం ఇదే జరుగుతుందని ఓ చర్చ అయితే వాడి వేడిగా సాగుతోంది.
ఎన్టీఆర్ జిల్లా: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడ రూరల్ రామవరప్పాడు శివారు నెహ్రూ నగర్ కట్టపై ఎన్డీయే కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఆయన ఎక్కడికి వెళ్లినా మహిళలు హారతులతో స్వాగతం పలుకుతున్నారు.
త్వరలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలుకెళ్లడం ఖాయమని గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkata Rao) వార్నింగ్ ఇచ్చారు. గురువారం నాడు విజయవాడ రూరల్ రామవరప్పాడులో తెలుగుదేశం కార్యాలయాన్ని ప్రారంభించారు.
Andhrapradesh: రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు విషయంలో ఒక మెట్టు కింద దిగిన పవన్ కళ్యాణ్‌కు టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు హ్యాట్సాఫ్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందన్నారు. నిన్నటి వరకు ఒక్క బస్సు కూడా ఇవ్వని అధికారులు ఇప్పుడెందుకు బస్సులిస్తామని చెప్తున్నారని ప్రశ్నించారు.
టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు నిరసన దీక్ష వద్ద వైసీపీ నేత వల్లభనేని వంశీ హై డ్రామాకు తెరదీశారు. సీసీ టీవీ ఫుటేజ్ సాక్షిగా వంశీ కాన్వాయ్ విజువల్స్ దొరికిపోయాయి. నిన్న టీడీపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా ఎనికపాడులో యార్లగడ్డ దీక్షకు దిగారు. అక్కడకు వల్లభనేని వంశీ వచ్చారు. అయితే పోలీస్‌లతో ముందుగా మాట్లాడుకొనే వంశీ వచ్చారని టీడీపీ నేతలు చెబుతున్నారు
వైసీపీ నేతల అరాచకాలకు అడ్డు కట్ట వేయడంలో పోలీసులు విఫలమయ్యారని గన్నవరం టీడీపీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. కొంతమంది పోలీసులు ఖాకీ యూనిఫాం వేసుకుని వైసీపీ కార్యకర్తల్లాగా పని చేస్తున్నారన్నారు. పోలీసులు తమ పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్నారని తెలిపారు.
విజయవాడలో మరోసారి వైసీపీ (YSRCP) మూకలు రెచ్చిపోయారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో టీడీపీ నేతలపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. ఓ కేసు వాయిదా కోసం కోర్టుకు గన్నవరం టీడీపీ (TDP), వైసీపీ నేతలు వచ్చారు. ఈ సమయంలో వైసీపీ నేతలు కోర్టు ఆవరణలో అలజడి సృష్టించారు.
గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాల దందా వెలుగు చూసింది. గత ఎన్నికలకు ముందు కూడా ఇలానే 11 వేల నకిలీ పత్రాలను మాజీ ఎమ్మెల్యే వంశీ పంపిణీ చేశారు. అప్పట్లో బాపులుపాడు మండలానికే నకిలీ పట్టాల పంపిణీ పరిమితమైంది.
గన్నవరంలో దొంగ ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని గన్నవరం తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. నిజమైన నిరుపేద అర్హులకు ఇళ్ల పట్టాలు ఇస్తే తానే స్వాగతిస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానూ ఇదే తరహా దొంగ ఇళ్ల పట్టాలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీ దొంగ ఓట్ల చేరికకు కుట్ర పన్నిందన్నారు.
కృష్టా జిల్లా: వల్లభనేని వంశీ, అతని అనుచరులను టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు హెచ్చరించారు. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై ఆయన మండిపడ్డారు. ఊరి చెరువు మట్టి కొంతమంది జేబులోకి వెళుతుంటే సోదరులారా మీరెందుకు ప్రశ్నించడం లేదన్నారు. దాడులు చేసి రివర్స్ కేసు పెట్టే పరిస్థితి గన్నవరంలో ఉందన్నారు...