Share News

AP Election 2024: గన్నవరంలో హీటెక్కిన రాజకీయం.. చర్చకు దారి తీసిన నామినేషన్‌

ABN , Publish Date - Apr 20 , 2024 | 04:46 PM

ఏపీ సార్వత్రిక ఎన్నిక (AP Election 2024)ల్లో భాగంగా ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల నుంచి నామినేషన్లు స్వీకరిస్తుంది. ఈ నామినేషన్ వేసేందుకు తెలుగుదేశం (Telugu Desam Party), వైఎస్సార్సీపీ (YSRCP) అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు, వైఎస్సార్సీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీచేస్తున్నారు.

AP Election 2024: గన్నవరంలో  హీటెక్కిన రాజకీయం.. చర్చకు దారి తీసిన నామినేషన్‌

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నిక (AP Election 2024)ల్లో భాగంగా ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల నుంచి నామినేషన్లు స్వీకరిస్తుంది. ఈ నామినేషన్ వేసేందుకు తెలుగుదేశం (Telugu Desam Party), వైఎస్సార్సీపీ (YSRCP) అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు, వైఎస్సార్సీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీచేస్తున్నారు.


Atchannaidu: గులకరాయి డ్రామా దర్శకత్వం వాహించనవారికి తగిన రీతిలో సన్మానం... అచ్చెన్న ఎద్దేవా

అయితే వీరిద్దరికి పార్టీ పరంగా రాజకీయ విబేధాలు ఉన్నాయి. పలుమార్లు ఇద్దరు నేతలు బాహాటంగానే వాగ్వాదాలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. దీంతో నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థులు గొడవకు దిగే అస్కారం ఉందని సమాచారం రావడంతో ఎన్నికల అధికారులు నామినేషన్‌ను ఓకే రోజు వేయొద్దని సూచించారు.


Lokesh: జగన్ రెడ్డి గారి జమానాలో నిజాలు చెప్పడమే నేరమా?!

కాగా.. ఈ నెల 25వ తేదీన నామినేషన్ వేసేందుకు టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు, వైఎస్సార్సీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ రిటర్నింగ్ అధికారికి దరఖాస్తులు ఇచ్చారు. ఉదయం 9.30 గంటలకు నామినేషన్లు వేసేందుకు ఇరువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేసుకున్నారు. ఇరువురికి అనుమతి నిరాకరిస్తూ రిటర్నింగ్ అధికారి మెయిల్ పంపించారు.


Nara Brahmani: మహిళలను ఆదుకునేందుకే సూపర్ - 6 పథకాలు... ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణి

తమకు సమయం ఇవ్వాల్సిందేనని అభ్యర్థులు పట్టుబడుతున్నారు. దీంతో గన్నవరంలో రాజకీయం హీటెక్కింది. తాను ముందే దరఖాస్తు చేశానని యార్లగడ్డ వెంకటరావు అధికారులకు తెలిపారు. ఇరువురు ఒకేసారి నామినేషన్ వేస్తే శాంతిభద్రతలు సమస్య వస్తుందని అధికారులు అంటున్నారు. ఇరువురు చెరో తేదీన నామినేషన్ వేయాలని అధికారులు సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Chandrababu: ఆడబిడ్డలను ప్రపంచంలోనే శక్తివంతులుగా చేసే బాధ్యత నాది..

PM Modi: చంద్రబాబు అనుభవజ్ఞుడైన నాయకుడంటూ మోదీ జన్మదిన శుభాకాంక్షలు..

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 20 , 2024 | 05:32 PM