Home » YCP MP Pilli Subhash Chandra Bose
పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలకు వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (pilli subhash chandra bose) తెరదించారు.
వానాకాలంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార పార్టీలో కుమ్ములాటలు బజారున పడ్డాయి. గత కొద్ది రోజులుగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్-ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య తలెత్తిన విభేదాలు ప్రస్తుతం తారాస్థాయికి చేరాయి.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీలో నేతల మధ్య విబేధాలు ఎక్కువవుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari) మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ (Minister Venu Vs MP Pilli) మధ్య ‘రామచంద్రాపురం’ (Ramachandrapuram) గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే...
స్వయంగా ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకున్నప్పటికీ పరిస్థితి ఏ మాత్రం సద్దుమణగలేదు. మంత్రి వేణు, ఎంపీ బోసు నువ్వా? నేనా? అన్నట్టు ఇరు వర్గాలు తలపడుతున్నాయి. తనకు వ్యతిరేకంగా మంత్రి వేణు వర్గం పనిచేస్తున్నా.. అధిష్టానం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని ఎంపీ బోసు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరుణంలో వచ్చే నెలలో ఏ క్షణమైనా వైసీపీకి రాజీనామా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో (YS Jaganmohan Reddy) వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash Chandra Bose) సమావేశమయ్యారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో తన వివాద విషయంపై మంగళవారం జగన్‌తో పిల్లి సుభాష్ చంద్రబోస్ చర్చించారు. ఈ భేటీలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌పై జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
అమరావతి: అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం వైకాపా నేతల పంచాయతీ తాడేపల్లికి చేరింది. మంత్రి చెల్లుబోయిన వేణు, పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య తీవ్రమైన విభేధాలు నెలకొన్నాయి. ఇరు వర్గాలు పరస్పర తీవ్ర ఆరోపణలు, దాడులు చేసుకున్నారు.
కాకినాడ పట్టణ నియోజకవర్గం వైసీపీ (YCP) ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై (Dwarampudi Chandrasekhar Reddy) వైసీపీ సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash Chandra Bose) పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
కోనసీమ జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం సీటును తన కుమారుడికి ఇప్పించేలా ఎంపీ సుభాష్ చంద్రబోస్ ప్రయత్నిస్తుండగా.. తన సీటు వదులుకునేందుకు మంత్రి వేణుగోపాలకృష్ణ సుముఖంగా కనిపించడం లేదు. దీంతో జిల్లాలో ఈ ఇద్దరు అధికార పార్టీ నేతలు ఆధిపత్యం కోసం పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే రామచంద్రపురంలో తనకు వ్యతిరేకంగా ఏమీ జరగడం లేదని మంత్రి వేణు క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.
మంత్రి వేణుకు వ్యతిరేకంగా ఆదివారం ఉదయం రామచంద్రపురంలో వైసీపీ కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ కార్యకర్తలపై మంత్రి వేణు అక్రమ కేసులు బనాయిస్తున్నరని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ఎంపీ బోస్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మంత్రి వేణుకు టిక్కెట్ ఇస్తే ఆయనపై స్వయంగా బోసే తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా జోరందుకుంది. కాగా ఉమ్మడి జిల్లా వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లుగా ఎంపీ బోస్, మరో ఎంపీ మిథున్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.