Home » YES Bank Ltd.
ఈరోజు ఏప్రిల్ నెల చివరి రోజు. రేపటి నుంచి కొత్త మే నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల 1వ తేదీన కొన్ని మార్పులు ఉంటాయి. ఈ క్రమంలోనే మే నెలలో కూడా పలు మార్పులు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం. మే 1 నుంచి క్రెడిట్ కార్డుల(credit cards) యుటిలిటీ బిల్లు చెల్లింపులపై బ్యాంకులు 1% అదనపు ఛార్జీని విధించనున్నాయి.
మీకు యెస్ బ్యాంక్(YES Bank), ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) సేవింగ్ ఖాతాలు(savings accounts) ఉన్నాయా అయితే జాగ్రత్త. ఎందుకంటే మే 1 నుంచి సేవింగ్స్ ఖాతాలపై సర్వీస్ ఛార్జీలను మార్చుతున్నారు. దీంతోపాటు ఎంపిక చేసిన ఖాతాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. యెస్ బ్యాంక్(YES Bank) అధికారిక వెబ్సైట్ ప్రకారం వివిధ రకాల పొదుపు ఖాతాలలో కనీస సగటు బ్యాలెన్స్ (AMB) అవసరాలను సవరించారు.
Credit Card New Rules April 1st: మీరు క్రెడిట్ కార్డ్(Credit Card) వినియోగిస్తున్నారా? మీ కార్డ్‌పై ఆఫర్స్ ఉన్నాయా? అయితే, ఇప్పుడు ఆ ఆఫర్స్ వర్తించకపోవచ్చు! అవును, మరికొద్ది రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డులకు సంబంధించి పలు బ్యాంకులు(Banks) కీలక నిర్ణయం తీసుకున్నాయి. క్రెడిట్ కార్డు విషయంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చాయి. అవి కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బిఐ(SBI), ఐసీఐసీఐ బ్యాంక్(ICICI), యాక్సిస్ బ్యాంక్(Axis), ఎస్ బ్యాంక్(YES Bank) వంటి ప్రధాన బ్యాంకులు..
గత కొన్ని రోజులుగా బ్యాంకులు సీనియర్ సిటిజెన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లతోపాటు ఇతర డిపాజిటర్ల వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి.