Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా?.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్..!
ABN , Publish Date - Mar 22 , 2024 | 07:41 AM
Credit Card New Rules April 1st: మీరు క్రెడిట్ కార్డ్(Credit Card) వినియోగిస్తున్నారా? మీ కార్డ్‌పై ఆఫర్స్ ఉన్నాయా? అయితే, ఇప్పుడు ఆ ఆఫర్స్ వర్తించకపోవచ్చు! అవును, మరికొద్ది రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డులకు సంబంధించి పలు బ్యాంకులు(Banks) కీలక నిర్ణయం తీసుకున్నాయి. క్రెడిట్ కార్డు విషయంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చాయి. అవి కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బిఐ(SBI), ఐసీఐసీఐ బ్యాంక్(ICICI), యాక్సిస్ బ్యాంక్(Axis), ఎస్ బ్యాంక్(YES Bank) వంటి ప్రధాన బ్యాంకులు..
Credit Card New Rules: మీరు క్రెడిట్ కార్డ్(Credit Card) వినియోగిస్తున్నారా? మీ కార్డ్‌పై ఆఫర్స్ ఉన్నాయా? అయితే, ఇప్పుడు ఆ ఆఫర్స్ వర్తించకపోవచ్చు! అవును, మరికొద్ది రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డులకు సంబంధించి పలు బ్యాంకులు(Banks) కీలక నిర్ణయం తీసుకున్నాయి. క్రెడిట్ కార్డు విషయంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చాయి. అవి కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బిఐ(SBI), ఐసీఐసీఐ బ్యాంక్(ICICI), యాక్సిస్ బ్యాంక్(Axis), ఎస్ బ్యాంక్(YES Bank) వంటి ప్రధాన బ్యాంకులు రివార్డ్ పాయింట్స్, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి వాటిలో కీలక మార్పులు చేశాయి. ఆ మార్పులేంటో ఈ కథనంలో తెలుసుకోండి..
ఏ బ్యాంక్.. ఏం మార్పులు చేసిందంటే..
SBI: ఎస్బీఐ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల విధానాల్లో కీలక మార్పులు చేసింది. అద్దె చెల్లింపులపై ఇస్తున్న రివార్డ్ పాయింట్లను.. ఇకపై ఇవ్వబోమని స్పష్టం చేసింది. SBI AURUM, SBI Card Elite, SBI Simply Click కార్డులకు ఇది వర్తిస్తుంది. ఈ కొత్త విధానం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఎస్బిఐ తెలిపింది.
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కూడా రివార్డ్ పాయింట్స్, లాంజ్ యాక్సెస్, యానువల్ ఫీజ్‌లో మార్పులు చేసింది. యాక్సిస్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్‌కు ఈ మార్పులు వర్తిస్తాయి. బీమా, ఆభరణాలు, ఇంధనం కోసం క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపే లావాదేవీలపై ఇక నుంచి ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ఇవ్వమని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. అయితే, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే మూడు నెలల్లో కనీసం రూ.50 వేలు ఖర్చు చేయాలి. అంతేకాదు.. ఒక సంవత్సరంలో దేశీయ, అంతర్జాతీయ లాంజ్ల్లోకి కాంప్లిమెంటరీ గెస్ట్ సందర్శనల సంఖ్యను కూడా తగ్గించనున్నట్లు ప్రకటింది. ప్రస్తుతం ఏడాదికి 8 మందికి అవకాశం ఉండగా దానిని 4 కు తగ్గించనున్నట్లు పేర్కొంది. అయతే, ఈ నిబంధనలు ఏప్రిల్ 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.
ICICI: ఈ బ్యాంకు కూడా కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో నిబంధనల్ని మార్చింది. వచ్చే త్రైమాసికంలో ఈ సదుపాయం పొందాలంటే.. మునుపటి త్రైమాసికంలో ఐసిఐసి క్రెడిడ్ కార్డ్ ద్వారా కనీసం రూ.35 వేలు ఖర్చు చేసి ఉండాలి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయి.
YES Bank: యస్ బ్యాంక్ కూడా తన క్రెడిట్ కార్డుల వినియోగానికి సంబంధించి కొన్ని నిబంధనలు మార్చింది. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్‌లో రూల్స్ చేంజ్ చేసింది. వచ్చే త్రైమాసికంలో లాంజ్ యాక్సెస్ పొందాలంటే.. మునుపటి త్రైమాసికంలో కార్డ్ ద్వారా కనీసం రూ.10,000 ఖర్చు చేసి ఉండాలని పేర్కొంది. ఈ నిబంధన ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని యస్ బ్యాంక్ స్పష్టం చేసింది. స్పష్టం చేసింది.