Home » YS Viveka
గొడ్డలి వేటు సూత్రధారి(ఎంపీ అవినాష్రెడ్డి)ని అమాయకుడంటే రాష్ట్ర ప్రజలను కించపరచడమే, కడప ప్రజలను వంచించడమేనని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) సంచలన ఆరోపణలు చేశారు.
తన తండ్రి వైయస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసి అయిదేళ్లు పూర్తి అయింది. ఆ కేసులో నిందితులను నేటికి అరెస్ట్ చేయలేదు. అంతేకాకుండా... ఈ హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వేళ.. అతడికి మళ్లీ కడప లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి(YS Viveka) సతీమణి సౌభాగ్యమ్మ(YS Sowbhagyamma).. సీఎం జగన్కు(CM YS Jagan) బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో సంచలన విషయాలు పేర్కొన్నారు సౌభాగ్యమ్మ. తండ్రిని కోల్పోయిన సునీత(YS Sunitha) ఎంత మనోవేదనకు గురయ్యారో ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు..
మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య (Vivekananda Reddy Case), పెండింగ్ కేసులపై ఎవరూ మాట్లాడవద్దని కడప కోర్ట్ ఇచ్చిన తీర్పుపై ఏపీ హైకోర్టు (AP High Court)లో తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి అప్పీల్ వేశారు. ఇదే అంశంపై మంగళవారం ఏపీ హైకోర్టును వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల నుంచి మౌనంగాఉండి ఈరోజు వివేకా నంద రెడ్డి హత్య గురించి మాట్లా డుతున్నారని.. ఆయనకు ప్రతి ఒక్కటి బాగా తెలుసని ఈ హత్య కేసు నిందితుడు, జై భీమ్ పార్టీ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి తెలిపారు. సిద్ధం సభలు పెట్టుకొని జగన్మో హన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవ రు హత్య చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు.
రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అలాగే ఆయన సోదరుడు, కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి సైతం ఆయన సొంత నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనే ఓ చర్చ ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో హల్చల్ చేస్తోంది.
ఏపీ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9:30 నుంచి కడప నగరంలో సునీతా రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం ఉదయం 11.10 గంటలకు కడప కలెక్టరేట్లో నామినేషన్ వేయనున్నారు.
‘హత్య విషయంపై మేం అక్కాచెల్లెళ్లం మాట్లాడుతుంటే వైసీపీ నేతలకు ఓడిపోతామనే భయం పట్టుకుంది. అందుకే కోర్టుకు వెళ్లారు. అయినా వీరు వేసిన పిటిషన్లో కోరింది ఒకటి.. కోర్టు ఇచ్చిన ఆర్డర్ మరొకటి. దీనిపై సుప్రీంకోర్టుకైనా వెళ్తాం’ అని...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
తండ్రి వైఎస్ వివేకా హత్యోదంతాన్ని వివరిస్తూ సునీతా రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తాను ఒంటరినని.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు తనకు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వాలని వివేకా అడిగారన్నారు. వివేకా పేరును ఓటరు జాబితా నుంచి అప్పట్లో తీసివేశారన్నారు. మొదటి ఛార్జిషీట్లో సీబీఐ నలుగురి పేర్లు పెట్టిందని సునీత తెలిపారు.