Home » YS Viveka
వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ఇవాళ మీడియా ముందుకు రానున్నారు. 11 గంటలకి ఢిల్లీ కాన్స్ట్యూషన్ క్లబ్ లో సునీతారెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వివేకానంద రెడ్డి హత్యకు కుట్ర దారులు ఎవరో మీడియాకు సునీతారెనడ్డి వెల్లడించనున్నారు. మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ బాబాయి హత్య ఘటన జరిగి ఐదేళ్లు పూర్తి కావొస్తోంది.
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు గురువారం కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను కలిశారు. వివేకా హత్య కేసులో తమకు ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు..తమపై పెట్టిన కేసుల వివరాలపై ఎస్పీతో సునీత, రాజశేఖర్ రెడ్డి చర్చించారు.
YS Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్ మంజూర్ అయ్యింది. వివేకా కేసులో(Viveka Murder Case) అప్రువర్‌గా మారిన దస్తగిరికి బెయిల్ మంజూరైంది. కడప జిల్లా కోర్టు(Kadapa District Court) దస్తగిరికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది.
వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ డైలీ సీరియల్ మాదిరిగా సాగుతూనే ఉంది. నేడు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది.
నేడు కడప సెంట్రల్ జైలు నుంచి వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరి బెయిల్‌పై విడుదల కానున్నాడు. నిన్న హైకోర్టు దస్తగిరికి బెయిల్ మంజూరు చేసింది. వివేకా హత్యకేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారాడు.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఫిబ్రవరిలో విచారించనుంది. వైఎస్ వివేకానంద హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
వైఎస్ వివేకానందారెడ్డి ( YS Vivekananda Reddy ) కేసుకు సంబంధించి జమ్మలమడుగు కోర్టుకు సీబీఐ అధికారులు వెళ్లారు. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కాపీలను కోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు. నాటి సీబీఐ విచారణాధికారి రామ్‌సింగ్, వివేకాకుమార్తె సునీత, రాజశేఖర్‌రెడ్డిపై పులివెందుల కోర్టులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ( Vivekananda Reddy ) హత్య కేసు నిందితుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి ( Bhaskar Reddy ) కి కండిషన్ బెయిల్ ముగిసింది. కండిషన్ బెయిల్ ముగియడంతో సీబీఐ కోర్టు ( CBI Court ) లో భాస్కర్‌రెడ్డి లొంగిపోయారు.
వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. దస్తగిరి పిటిషన్‌ను నవంబర్ 20కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. కౌన్సిల్ లేకపోవడంతో వాదనలకు దస్తగిరి అడ్వకేట్ సమయం కోరారు. నిందితులకు ఇచ్చిన హార్డ్ కాపీలను సైతం దస్తగిరి తీసుకోలేదు.
తాడిపత్రి(Tadipatri) ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి( MLA Ketireddy Peddareddy) తాను లేని సమయంలో ఇంటికి వచ్చి కూర్చున్న సంఘటన తర్వాత ఉరేసుకుని చద్దామనుకున్నానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ సోదరుల్లో ఒకరైన ప్రభాకర్‌రెడ్డి (Prabhakar Reddy) వ్యాఖ్యానించారు.