Share News

YS Viveka Case : దస్తగిరి పిటిషన్‌పై విచారణ 20కి వాయిదా..

ABN , First Publish Date - 2023-11-15T12:04:53+05:30 IST

వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. దస్తగిరి పిటిషన్‌ను నవంబర్ 20కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. కౌన్సిల్ లేకపోవడంతో వాదనలకు దస్తగిరి అడ్వకేట్ సమయం కోరారు. నిందితులకు ఇచ్చిన హార్డ్ కాపీలను సైతం దస్తగిరి తీసుకోలేదు.

YS Viveka Case : దస్తగిరి పిటిషన్‌పై విచారణ 20కి వాయిదా..

హైదరాబాద్ : వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. దస్తగిరి పిటిషన్‌ను నవంబర్ 20కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. కౌన్సిల్ లేకపోవడంతో వాదనలకు దస్తగిరి అడ్వకేట్ సమయం కోరారు. నిందితులకు ఇచ్చిన హార్డ్ కాపీలను సైతం దస్తగిరి తీసుకోలేదు. తనను నిందితుడి జాబితా నుంచి తొలగించాలని దస్తగిరి కోరారు. సాక్షిగా పరిగణించాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దస్తగిరి పిటిషన్‌ను సీబీఐ కోర్టు నవంబర్ 20కి వాయిదా వేసింది.

వైఎస్ వివేకా కేసులో తనను దోషిగా తొలగించాలని.. కేవలం సాక్షిగా మాత్రమే పరిగణించాలని దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సీబీఐ దాఖలు చేసిన మొదటి చార్జ్ షీట్‌లో తనను సాక్షిగా చేర్చిందని దస్తగిరి వెల్లడించారు. వైఎస్ వివేకా హత్యకేసులో దస్తగిరి ఏ-4గా ఉన్నాడు. అనంతరం ఇదే కేసులో అప్రూవర్‌గా మారాడు.

Updated Date - 2023-11-15T12:04:55+05:30 IST