Home » Yuvagalam Padayatra
YuvaGalam: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది. ఈ సారి వర్షాల కారణంగా యువగళం పాదయాత్ర నిలిచిపోయింది. ‘‘మిచాంగ్’’ తుఫాన్ రేపు(మంగళవారం) మధ్యాహ్నం నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది.
Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా కాకినాడలో లోకేష్‌ను దివ్యాంగుల జేఏసీ ప్రతినిధులు కలిసి సమస్యలు చెప్పుకున్నారు.
Nara lokesh: నగరంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర జనజాతరను తలపిస్తోంది. కాకినాడ నగరంలో యువగళానికి ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.
YuvaGalam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈరోజు(బుధవారం) ముమ్మడివరం ఉమెన్స్ డిగ్రీ కాలేజి వద్ద నుంచి 212వ రోజు పాదయాత్రను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా లోకేష్‌ను డ్వాక్రా మహిళలు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.
YuvaGalam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 211వ రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం పేరూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర మొదలైంది. లోకేష్ వెంట భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రలో పాల్గొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ శుభం గ్రాండ్ నుంచి నారా లోకేష్ 210వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం 10.19 గంటలకు పునఃప్రారంభించారు. మంగళవారం యువగళం 211వ రోజు పాదయాత్ర అమలాపురం, ముమ్మడివరం నియోజకవర్గాల్లో కొనసాగనుంది.
YuvaGalam: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పి.గన్నవరం నియోజకవర్గం నగరం గ్రామానికి చెందిన ఓఎన్జీసీ – గెయిల్ బాధితులు లోకేష్‌ను వినతిపత్రం అందజేశారు. 2014 జూన్ 27న తమ గ్రామంలోని ఓఎన్జీసీ - గెయిల్ పైపులైన్ల బ్లాస్టింగ్ జరిగిందని.. ఈ ప్రమాదంలో 22 మంది చనిపోయారని.. అనేకమంది క్షతగాత్రులయ్యారని తెలిపారు.
Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. సోమవారం ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను యువనేత మొదలుపెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ పాదయాత్రకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు బెయిల్‌పై బయటకు వచ్చారు.
నేటి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పున: ప్రారంభం కానుంది. నేటి ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి ఉదయం 10.19 గంటలకు లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకూ 209 రోజుల పాటు 2852.4 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
BTech Ravi Arrest Issue : కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి (BTech Ravi) కిడ్నాప్‌నకు గురయ్యారు.! కడప నుంచి పులివెందుల (Pulivendula) వస్తుండగా రవిని 20 మంది ఆగంతకులు ఎత్తుకెళ్లారు!.