Share News

Lokesh YuvaGalam: 211వ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం.. నేటి షెడ్యూల్ ఇదే

ABN , First Publish Date - 2023-11-28T09:48:30+05:30 IST

YuvaGalam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 211వ రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం పేరూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర మొదలైంది. లోకేష్ వెంట భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రలో పాల్గొన్నారు.

Lokesh YuvaGalam: 211వ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం.. నేటి షెడ్యూల్ ఇదే

తూర్పుగోదావరి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP leader Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) 211వ రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం పేరూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర మొదలైంది. లోకేష్ వెంట భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రలో పాల్గొన్నారు. దాదాపు రెండు నెలల తర్వాత నిన్న (సోమవారం) డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ శుభం గ్రాండ్‌ నుంచి నారా లోకేష్ 210వ రోజు పాదయాత్రను పున:ప్రారంభించిన విషయం తెలిసిందే.


నేటి పాదయాత్ర షెడ్యూల్ ఇదే..

  • ఉదయం పాదయాత్ర మొదలైన వెంటనే పేరూరు క్షత్రియ కళ్యాణ మండపం వద్ద ఆక్వా రైతులతో భేటీ.

  • 10 గంటలకు అమలాపురం హైస్కూలు సెంటర్ లో బిసిలతో సమావేశం.

  • 10:15 గంటలకు అమలాపురం క్లాక్ టవర్ సెంటర్‌లో చేనేత కార్మికులతో సమావేశం.

  • 10:30 గంటలకు అమలాపురం ముమ్మడివరం గేటు వద్ద దివ్యాంగులతో భేటీ

  • 10:45 గంటలకు అమలాపురం పుల్లయ్య రామాలయం వద్ద గంగిరెడ్డి సామాజికవర్గీయులతో మీటింగ్

  • 11 గంటలకు అమలాపురం వెంకటేశ్వరస్వామి గుడివద్ద కాపులతో సమావేశం.

  • 12:30 గంటలకు భట్నవిల్లిలో ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ

  • 12:40 గంటలకు భట్నవిల్లిలో యువతతో ముఖాముఖి కార్యక్రమం

  • 1:40 గంటలకు భట్నవిల్లిలో భోజన విరామం.

సాయంత్రం

  • 4 గంటలకు భట్నవిల్లి నుంచి తిరిగి లోకేష్ పాదయాత్ర కొనసాగింపు.

  • 4:30 గంటలకు పాదయాత్ర ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

  • 5 గంటలకు అనంతవరం సెంటర్‌లో స్థానికులతో సమావేశం.

  • 6 గంటలకు గున్నేపల్లిలో స్థానికులతో భేటీ..

  • 7:45 గంటలకు ముమ్మడివరంలో స్థానికులతో సమావేశం.

  • రాత్రి 8:30 గంటలకు ముమ్మడివరం ఉమెన్స్ కాలేజి వద్ద విడిది కేంద్రంలో బస.

Updated Date - 2023-11-28T09:48:33+05:30 IST