Home » Technology
ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సాప్ తన వినియోగదారుల భద్రత, ప్రైవసీ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా మరో ఉపయోగకర ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు వాట్సాప్ తాజాగా వెల్లడించింది.
బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి షియోమీ (Xiaomi) సబ్-బ్రాండ్ కంపెనీ రెడ్మీ (Redmi) గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.13,999 ధరలలో అదిరిపోయే కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. రెడ్మీ 13 5జీని (Redmi 13 5G) భారత మార్కెట్లో విడుదల చేసింది.
దేశంలో మూడు అతిపెద్ద టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా.. తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను విపరీతంగా పెంచాయి. దీంతో సామాన్యులు రీఛార్జ్ మాటెత్తితేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గణనీయమైన ధరల పెంపు వినియోగదారులపై తీవ్రంగా ప్రభావం చూపింది.
రామడుగు మండలంలో అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి. రోడ్లపై గుంతలు పడి రాకపోలకు ఇబ్బంది కలిగినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇకపై గూగుల్ మ్యాప్స్(Google Maps) కాదు.. ఓలా మ్యాప్స్.. ఇదేంటి.. గూగుల్ మ్యాప్స్ స్థానంలో ఓలా మ్యాప్స్ రాబోతున్నాయా. అంటే అవుననే అంటున్నారు ఓలా కంపెనీ సీఈవో భవీశ్ అగర్వాల్. కానీ ఒక ట్విస్ట్. ఓలా యాప్‌లోనే ఈ మార్పు అని ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు.
మీరు మంచి ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే Motorola Razr 50 Ultra నేడు (జూలై 4న) మార్కెట్లోకి వచ్చింది. ఈ వెర్షన్లో పెద్ద డిస్ప్లే, మెరుగైన డిజైన్, IP రేటింగ్, కొత్త హార్డ్‌వేర్ సహా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.
ప్రస్తుతం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్(WhatsApp) వాడకం సర్వసాధారణమైపోయింది. ప్రజలు ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఎవరితోనైనా సులభంగా ఇంటరాక్ట్ చేయవచ్చు. ఈ క్రమంలోనే పలు ఫీచర్లపై(features) వాట్సాప్ ఎప్పటికప్పుడు పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలో యూజర్లకు మరో రెండు అద్భుతమైన ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
మీరు శామ్సంగ్ అభిమానులా? శామ్సంగ్ గెలాక్సీ S24 FE (Samsung Galaxy S24 FE) ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా? ఆ మొబైల్‌ను కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. లాంఛింగ్‌కు ముందే ఆ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ఇతర వివరాలు లీక్ అవుతున్నాయి
యూట్యూబ్ తన ప్రైవసీ పాలసీలను తాజాగా అప్డేట్ చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించే ఫేక్ వీడియోలను కట్టడి చేయడంపై యూట్యూబ్ సీరియస్‌గా దృష్టి సారించింది. ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీల వాయిస్, ఫేస్‌ను ఉపయోగించి చాలా మంది ఫేక్ వీడియోలను రూపొందిస్తున్నారు.
జిల్లా, మండల పరిషత్ పాలకవర్గాల గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. మండల, జిల్లాపరిషత్ ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన పనులకు 15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.