Home » Telangana » Adilabad
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సర్వే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుండగా, 60 రోజుల్లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్‌ను నియమించారు.
మంచిర్యాల ఫారెస్టు డివిజన్ పరిధిలోకి పెద్దపులి వచ్చింది. ఆదివారం సాయంత్రం ముత్యంపల్లి సెక్షన్ మామిడిగూడలోని గోండుగూడకు చెందిన గిరిజన రైతు చిత్రు ఆవుల మందపై దాడి చేసి మూడు ఆవులను చంపింది. దీంతో పెద్దపులి వచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సంచరిస్తున్న పెద్దపులి ఎస్ 12 మగ పులిగా అధికారులు భావిస్తున్నారు.
జిల్లాలో చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి కృష్ణాదిత్య అన్నారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్లో కలెక్టర్లు కుమార్‌దీపక్, వెంకటేష్ దోత్రె, అదనపు కలెక్టర్లు మోతిలాల్, దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్దశుక్లా, అదనపు ఎస్పీ ప్రభాకర్రావులతో కలిసి 2 జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు.
మధ్యాహ్న భోజన నిర్వాహకులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను కార్యాలయ ఏవో, విద్యా శాఖ సూపరింటెండెంట్‌కు అందించారు.
జిల్లా కోర్టుకు భవన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగన్ మంగళ వారం ఒకరోజు మౌనదీక్ష చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్దగల హనుమాన్ విగ్రహం వద్ద ఆయన ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేశారు.
పత్తి సాగు చేస్తున్న రైతుల్లో ఆందోళన నెలకొంది. పత్తి ఏరివేతకు చేలు సిద్ధంగా ఉండగా ఇప్పటివరకు ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో సొంత ఇంటి కోసం ఎదరుచూస్తున్న నిరు పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల విష యంలో సొంత స్థలం ఉన్నవారికి మొదట ప్రాధాన్యం ఇవ్వనుండగా, లేనివారికి 75 గజాల స్థలం ఇవ్వనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
ఆసిఫాబాద్, నవంబరు 4(ఆంద్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా మని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
ప్రజల ప్రాణాలను కాపాడే వైద్య వృత్తి ఎంతో విలువైందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్ర మానికి ప్రిన్సిపాల్ దావూద్ సులేమాన్‌తో కలిసి హాజర య్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలో 3వ బ్యాచ్ కొనసాగుతుందని, వైద్య విద్యార్థులు ఏకా గ్రతతో చదువుకుని ఉన్నత స్ధానానికి చేరుకోవాలన్నారు.
ఆసిఫాబాద్, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక,విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వే కార్యక్రమాన్ని అధికారులు సమన్వ యంతో పూర్తిచేయాలని కలెక్టర్ వెంకటేష్‌దోత్రే అన్నారు.