Home » Telangana » Adilabad
ఆసిఫాబాద్రూరల్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని గిరిజనబాలికల ఆదర్శ పాఠశాల ఆవరణలో గడిగొప్పుల సదానందం(పీడీ) జ్ఞాపకార్థం జరుగుతున్న రాష్ట్రస్థాయి సబ్జూనియర్ బాలికల హ్యాండ్బాల్ పోటీలు రెండోరోజు ఆదివారం హోరాహోరీగా సాగాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఐబీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్ధిక, రాజకీయ, విద్య, కుల గణన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి, మండల ప్రత్యేకాధికారి కల్పన పేర్కొన్నారు. ఆదివారం బీసీ కాలనీలో జిల్లా పంచాయతీ అధికారి, ముదిరాజ్ కాలనీలో జరుగుతున్న సర్వేను మండల ప్రత్యేకాధికారి పరిశీలించారు.
కార్తీక మాసం ఆదివారం సెలవు రోజు కావడంతో గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 25వేల మందిపైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు.
పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అభయాంజనేయస్వామి ఆలయ భూములను రక్షించాలని బీజేపీ నాయకులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ మాట్లాడుతూ గతం లో ఆలయ భూములను కబ్జా చేశారని కమిటీ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారని, అదికారులు సర్వేచేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపారన్నారు.
బెజ్జూరు, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది పంట చేతికొచ్చే సమయంలో సరైన వర్షాలు కురవక ఆపసోపాలు పడుతున్న అన్నదాతకు అడవిపందుల రూపంలో మరో ఎదురుదెబ్బ ఎదురవుతోంది.
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్రూరల్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లా కాంగ్రెస్లో గ్రూపువిభేదాలు గుప్పుమన్నాయి. డీసీసీఅధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, ఆసిఫాబాద్ నియోజకవర్గఇన్చార్జీ శ్యాంనాయక్ వర్గీయులమధ్య ఎన్నో రోజులుగా కొనసాగుతున్న విబేధాలు శనివారం జరిగిన కులగణన జిల్లాస్థాయి సమావేశంలో బయటపడి తారస్థాయికి చేరుకుంది.
ఆసిఫాబాద్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): వానాకాలం వరిధాన్యం కొనుగోలుకేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిఉత్తంకుమార్రెడ్డి అన్నారు.
జైనూర్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జైనూరు మండల తహసీల్దార్, గ్రామకార్యదర్శి శనివారం రూ.12వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
వాంకిడి, నవంబరు 2(ఆంధ్ర జ్యోతి): ఆశ్రమపాఠశాలలో వాం తులు, విచేరనాలతో అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందిస్తామని ఐటీడీఏ పీవో ఖుష్బుగుప్తా పేర్కొన్నారు.