Home » Telangana » Hyderabad
రాష్ట్రంలో వైరల్ జ్వరాలు దడపుట్టిస్తున్నాయి. ప్లేట్లె ట్లు తగ్గిపోవడం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నీరసంతోపాటు.. 103 డిగ్రీలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జ్వరాలు రెండు మూడు రోజులకే తగ్గిపోతున్నా.. అనంతర పరిణామాలు తీవ్రంగా ఉంటున్నాయి.
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 100మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.
హైదరాబాద్లో మరో భారీ మోసం వెలుగు చూసింది. రూ.8.08 లక్షలు కనీస పెట్టుబడిగా పెట్టి రెండు గుంటల స్థలాన్ని కొనుగోలు చేసిన వారికి 25 నెలలపాటు ప్రతి నెలా రూ.32 వేలు చెల్లిస్తామని 12 వెల్త్ సంస్థ నమ్మించింది. అలా ఏకంగా వందల కోట్లు కొల్లగొట్టింది.
Telangana: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. అరెస్టు సమయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు తెలిపారు. హత్యాయత్నం కేస్ తప్ప మిగిలిన సెక్షన్లన్నీ 5 సంవత్సరాలలోపు శిక్ష పడేవే అని తెలిపారు.
Telangana: గచ్చిబౌలి సిద్ధిక్నగర్లో ఒరిగిపోయిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. చుట్టుపక్కల భవనాలకు ఎటువంటి నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హైడ్రాలిక్ జాక్ క్రషర్తో అధికారులు భవనాన్ని కూల్చివేస్తున్నారు.
Telangana: సీఎం సభకు ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే హాజరు కాలేదని.. దీంతోనే సీఎం అందరినీ కలుపుకుని పోవడం లేదని అర్థం అవుతోందని ఎర్రబెల్లి అన్నారు. ‘‘రేవంత్ ఓ చీటర్, ఏ బ్రోకర్, ఓ కబ్జాకోరు. రేవంత్ ఒక గంజాయి మొక్క, కేసీఆర్ మర్రిచెట్టు. రేవంత్కు ఢీల్లీలో రాహుల్, సోనియా అపాయింట్ దొరకడం లేదు. కాంగ్రెస్ వాళ్లే రేవంత్ పదవి ఊడగొడతారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
Telangana: పెద్ద చెరువు ముంపు బాధితుల ఫిర్యాదు మేరకు చెరువును పరిశీలించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువు విస్తీర్ణం 99 ఎకరాలు ఉందని, చెరువు అలుగులు, తూములు మూసివేయడంతో నీరు వచ్చి చేరి చాలా మంది ప్లాట్లు మునిగిపోయాయని ఫిర్యాదు అందిందని తెలిపారు.
కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రాష్ట్రంలో జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు సక్సెస్ ఫుల్గా ప్రజల్ని మోసం చేసినందుకు అపజయోత్సవాలు జరుపుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శలు చేశారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారని, పది నెలల రేవంత్ పాలనలో అందరి కడుపు కొట్టారని హరీష్రావు ధ్వజమెత్తారు.
సమసమాజ స్థాపన కోసం 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలను మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తీసుకుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వరంగల్ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. తమపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్లలో మాటలతో బీఆర్ఎస్ గడిపిందని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు.