Home » Telangana » Hyderabad
మూసీ, హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ భవన్లో హరీశ్ రావు ఛార్జ్ షీట్ విడుదల చేశారు.
డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాపాలన మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన పలు అంశాలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన- విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. విజయోత్సవాల ముగింపు వేడుకలు శనివారం నుంచి సోమవారం వరకూ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ వేడుకల్లో ప్రజలు కూడా భాగస్వాములయ్యేలా కార్యక్రమాలను రూపొందించారు.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చార్జ్ షీట్ సిద్ధం చేసింది. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు విడుదల చేస్తారు. హామీల అమలు విషయంలో రేవంత్ రెడ్డి మాట మార్చుతున్నారని హరీష్ రావు విమర్శించారు.
ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్, హుస్సేన్‌సాగర్(Tankbund, Hussain Sagar) పరిసరాల్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు.
ఇంతకాలం సైలెంట్‌గా తెలంగాణ బీజేపీ నేతలు.. ఒక్కసారిగా దూకుడు పెంచాడు. సరూర్ నగర్ వేదికగా భారీ బహిరంగ సభ పెట్టి.. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై ఏడాది పూర్తైన..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ వ్యయం దృష్ట్యా టికెట్ల ధరలు పెంచుకునేలా జీవో వచ్చేందుకు కారణమైన పవన్ కల్యాణ్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు అల్లు అర్జున్ చెప్పారు.
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. నూతన విగ్రహ నమూనాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినప్పటి నుంచి వివాదం రాజుకుంది.
Telangana: తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చ అవసరమా అని విమలక్క ప్రశ్నించారు. తెలంగాణ తల్లిపై చర్చ జరగడం బాధగా ఉందన్నారు. నిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉన్నామన్నారు. ప్రభుత్వాలు ప్రజల కోసం ఆలోచించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈనెల 9న సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానం అందజేశారు.