బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు తనపై జరుగుతున్న ప్రచారంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
తనపై చేస్తున్న ఆరోపణలపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడ లేదని.. తానేంటో ప్రజలకు తెలుసునని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు.
ఈనెల 13న ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా రాహుల్, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్లు చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పోలీసుల ఎదుట లొంగిపోవాలంటూ ఆయనకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రహమత్‌నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్‌లో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం ధాటికి మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమాకు మరో సమస్య ఎదురైంది. సినిమా టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.
ఇద్దరు ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ జీహెచ్ఎంసీ కమిషనర్ కె.ఇలంబర్తి, ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
జవహర్‌నగర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యాపారి హత్యకు కారణమైన వారిని పోలీసులు పట్టుకున్నారు. ఒక మైనర్ బాలుడుతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు.
తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 45,15,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.