అఖండ 2 సినిమా ఈ నెల 12న విడుదల కానున్న నేపథ్యంలో.. టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు రోజుల పాటు ఈ అవకాశం కల్పించింది. సినిమా టికెట్ ధరల వివరాలు ఎలా ఉంటాయంటే.?
హైదరాబాద్ చాంద్రయాణగుట్ట పరిధిలో మత్తు ఇంజెక్షన్ల కేసులో ఇద్దరు వైద్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఇద్దరూ కలిసి అక్రమంగా మత్తు ఇంజెక్షన్ల అమ్మకానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆ కారణంగానే ఇటీవల ఇద్దరు ఆటోడ్రైవర్లు మృతిచెందారని భావిస్తున్నారు.
అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం ఇండియా టూర్ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అతడి పర్యటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. మూడు రోజుల భారత పర్యటనలో నాలుగు ప్రధాన నగరాల్లో సెలబ్రిటీలతో కలిసి అభిమానుల్ని అలరించనున్నాడు మెస్సీ. ఆ పూర్తి షెడ్యూల్ వివరాలు మీకోసం...
తెలంగాణలో తొలి దశ పల్లె పోరుకు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. గురువారం ఉదయం 7.00 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రారంభమవుతుందన్నారు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలపై కవిత స్పందించారు. ఆయన చేసిన ప్రతి ఆరోపణలకు డాక్యుమెంట్లతో సహా ప్రెస్‌మీట్ పెడతానని వెల్లడించారు.
లావాదేవీలలో భాగంగానే కవిత - బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. కవిత కారణంగా బీఆర్ఎస్ కబ్జాలు అన్ని బయటకు వస్తున్నాయని విమర్శించారు.
ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులకు తమ ప్రభుత్వం అండగా ఉండాలనే ఓ ఆలోచనతో ఇక్కడకు వచ్చానని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో ఉన్న అగ్రస్థాయి స్టార్టప్స్‌లో గూగుల్ ఒకటని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మీరు యువకులు, శక్తివంతులు.. సాధారణంగా మీరు మీ కలలను సాకారం చేసుకోవాలనుకుంటారని పేర్కొన్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఈ సంవత్సరం సుమారు 20కు పైగా ఫేక్ బెదిరింపు కాల్స్, మెసేజెస్ వచ్చాయని శంషాబాద్ డీసీపీ రాజేశ్ తెలిపారు. ఫేక్ కాల్స్ మెయిల్స్‌పై దర్యాప్తు స్పీడ్ అప్ చేశామని పేర్కొన్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన కామెంట్స్ చేశారు. గ్లోబల్ సమ్మిట్ పేరిట రియల్ ఎస్టేట్ స్కాంకు తెరతీశారంటూ వ్యాఖ్యలు చేశారు.