తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో 3 వేల డ్రోన్లతో షో నిర్వహించారు. ఈ షో.. గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. అందుకు సంబంధించిన ధృవపత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.
ఫ్యూచర్ సిటీలో రెండో రోజు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇదో గొప్ప సమ్మిట్ అని కొనియాడిన చిరు.. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా సహకరిస్తామని ఈ సందర్భంగా అన్నారు.
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదల్లో నిరుపేదలకు సహాయం చేయడానికే తాము ప్రాధాన్యం ఇస్తామన్నారు.
తెలంగాణ గణనీయమైన వృద్ధి సాధిస్తోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. ప్రపంచానికి హైదరాబాద్ ఒక ఐకానిక్ సిటీ అని అభివర్ణించారు.
తెలంగాణ పాఠశాల విద్యార్థులు ఫుల్ హ్యాపీలో ఉన్నారు. ఎందుకంటే ఆరు రోజులపాటు సెలవులు వచ్చాయి. సెలవు రోజుల్లో ఎంజాయ్ మెంట్ కోసం లాంగ్ టూర్ కి ప్లాన్ చేసుకుంటున్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశమయ్యారు. మంగళవారం ఫ్యూచర్ సిటీలోని సీఎంతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వారితో సీఎం చర్చించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో గోల్డ్ క్వెస్ట్ అంశంపై చర్చ జరిగింది. ప్యానెల్ డిస్కషన్‌లో గుత్తా జ్వాల, పీవీ సింధు, కుంబ్లే, గోపీచంద్, అంబటి రాయుడు పాల్గొన్నారు.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒకేరోజు రెండు సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు.
గ్లోబల్ సమ్మిట్‌లో వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. సీఎం సమక్షంలో తెలంగాణలో పెట్టుబడులకు పలు కంపెనీలు ఎంవోయూలు కుదర్చుకుంటున్నాయి.