Home » Telangana » Karimnagar
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నది. జిల్లాలోని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్ పాటుపడుతున్నారు. గడిచిన ఏడాది కాలంలో విద్య, వైద్యం, విద్యుత్, రహదారుల అభివృద్ధితో పాటు టూరిజానికి ప్రాధాన్యం ఇచ్చారు.
. ఉపాధి కరువై నేతన్నలు వీధిన పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అందిన ఆర్డర్లు ఒక్కసారిగా నిలి చిపోవడంతో వస్త్ర పరిశ్రమలో సంక్షోభం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులతో పలువురు కార్మికులు బలవన్మరణం పొందారు. 23 మంది కార్మికులు మృతి చెందగా వీరిలో 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
ఇందిర మ్మ ఇల్లు రాలేదని పేదలు ఆందోళన చెందవద్దని, ప్రతి నిరుపేదకు విడతల వారీగా మంజూరుచేస్తామని ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణారావు స్పష్టం చేశారు.
ఉద్యోగులు ఎదు ర్కొంటున్న అన్ని సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించా లని టీఎన్జీవో సంఘం జిల్లా అధ్య క్షుడు, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ బొంకూరి శంకర్ కోరారు.
జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడి యట్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రయత్నించాలని అదనపు కలెక్టర్ వేణు పేర్కొన్నారు.
వరంగల్-మంచిర్యాల జాతీయ రహదారి ఎన్‌హెచ్ 163జీ నిర్మాణానికి సేకరించిన భూములలో ట్రెంచ్ కటింగ్ పనులు పూర్తి చేసి జాతీయ రహదారి ఆథారిటికి అప్పగిం చాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బకాయిలను ఇవ్వక పోవడం, నిధులను ప్రభుత్వం విడుదల చేయక పోవడంతో అభివృద్ధి పనులు ముందకు కదలడం లేదు. జిల్లాలో ఏడాది కాలంగా ఒక అడుగు ముందుకు రెండడుగుల వెనక్కి అన్నచందంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి.
గత వర్షాకాలం సీజన్లో సాధారణానికి మించి వర్షాలు కురియడంతో నీటి వనరులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీంతో రెండు పంటలకు ఢోకా లేకుండాపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో యాసంగి సీజన్, ఆ తర్వాత వానాకాలం సీజన్లో రైతులు సమృద్ధిగా పంటలు వేశారు.
జిల్లాలో రాజకీయం రసవత్తరంగా సాగింది. విభిన్న పరిణామాలకు తెరతీసింది. గత ప్రభుత్వ హయాంలో హవా కొనసాగించిన పలువురు నేతలు ఆయా పార్టీలకు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. ప్రతిపక్షంలోకి వెళ్లిన బీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీలు ఉనికిని చాటుకునే దిశగా పోరాట బాటను పట్టాయి.
అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గోదావరిఖని మెయి న్ చౌరస్తాలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.