Home » Telangana » Karimnagar
మున్సిపాలిటీల్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జగిత్యాల జిల్లాలో సంబంధిత కమిటీ ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు.
తెలంగాణలో గురుకుల పాఠశాల విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందిగా చేపట్టాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు.
రామ గుండం నగరపాలకసంస్థ పరిధిలో అక్రమ కట్ట డాల పేర కూల్చివేతలను నిరసిస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చం దర్ ఆధ్వర్యంలో బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆందోళన నిర్వహించారు.
పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
వృద్ధు లను టార్గెట్‌గా చేసుకొని సైబర్ నేరస్థులు మోసా లకు పాల్పడుతున్నారని రామగుండం సీపీ ఎం.శ్రీని వాస్ అన్నారు.
ప్రతిభావంతమైన యువతను గుర్తిం చి వారి చదువులకు ఆటంక కలుగకుండా క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని రామగుండం ఎమ్మె ల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం నుంచి సర్వే ప్రారంభం కానుంది. జిల్లాలోని 15 మండలాలు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీలను 1,958 ఎలకో్ట్రల్ బ్లాక్‌లుగా విభజించారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు 1964 మంది ఎన్యూమరేటర్లను, 207 మంది సర్వేయర్లను నియమించారు.
ఎన్నో ఆశలతో పతిసాగు చేసిన రైతులను దిగుబడి ఆందోళనకు గురి చేసింది. మరోవైపు చేతికొచ్చిన పంటను ఏరేందుకు కూలీల కొరత వేధించింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చిన కూలీలతో పత్తి రైతులకు కాస్తా ఊరట లభించింది.
జిల్లాలో పనిచేస్తున్న పలువురు ప్రభుత్వ వైద్యుల తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఆసుపత్రి పనివేళల్లో తమ సొంత క్లినిక్‌ల్లో సేవలు అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రధాన ఆసుపత్రి, మాతాశిశు కేంద్రంతో పాటు జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ పట్టణాల్లో గల తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు, పలు పీహెచ్సీ, యూహెచ్‌సీ, పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాల్లో పనిచేస్తున్న వైద్యుల్లో చాలామంది ప్రైవేటు ప్రాక్టిస్పైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.